Breaking News

నగరంలో కనని బ్యూటీ & ఎస్థెటిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మగువకు అందాన్ని పెంచాలంటే అందానికి మెరుగులు దిద్దాల్సిందే… దానికోసం అభిరుచిగల మహిళలు, యువతరం కోసం వారి అభిరుచికి అనుగుణంగా నగరంలో కనని బ్యూటీ & ఎస్థెటిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఘనంగా ప్రారంభమైంది. ఆదివారం కనని బ్యూటీ & ఎస్థెటిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ గురునానక్‌ కాలనీ రోడ్డు, ఆటోనగర్‌, ఖాన్స్‌ కిచెన్‌ బిల్డింగ్‌ మొదటి అంతస్తునందు ప్రారంభించబడిరది. ఈ సందర్భంగా ఫౌండర్‌, నిర్వాహకురాలు కామా ఉషారాణి మాట్లాడుతూ తనకు ఈ రంగంనందు బ్యూటీషియన్‌, టెక్నీయన్‌లు వంటి వివిధ విభాగాలనందు 19 సంవత్సరాలు అనుభవం వుందన్నారు. ఈ రంగం నందు మక్కువతో అంచెలంచెలుగా వివిధ విభాగాలలో ప్రముఖ సంస్థలు, ప్రముఖ స్పెషలిస్ట్‌ల వద్ద నేర్చుకుని కొనసాగుతూ ఇప్పుడు స్వంతంగా ఈ సంస్థను స్థాపించినట్లు తెలిపారు. భవిష్యత్‌లో మరిన్ని బ్రాంచ్‌లుగా విస్తరించాలని అభిషలిస్తున్నట్లు తెలిపారు. మా సంస్థ కనని బ్యూటీ & ఎస్థెటిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నందు సెలూన్‌, లేజర్‌, హెయిర్‌, స్కిన్‌, అవాంచిత రోమాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. మా వద్ద అనుభవజ్ఞులైన టెక్నీషియన్స్‌, బ్యూటీషిన్స్‌, డాక్టర్స్‌తో అందుబాటు ధరలలో లాభాపేక్ష లేకుండా సర్వీసును అందజేస్తున్నట్లు తెలిపారు. ఇటాలియన్‌, కొరియన్‌ తదితర అంతర్జాతీ బ్రాండ్‌లను కాస్మోటిక్స్‌ వాడతామన్నారు. కస్టమర్ల కోసం మావద్ద నేచురల్‌, ఆర్గానిక్‌ బేస్‌ ఐటమ్స్‌ను మాత్రమే వాడి ట్రీట్‌మెంట్‌ ద్వారా సేవలు అందజేస్తామన్నారు. పెడిక్యూర్‌లో ఫీట్‌ పాంపరింగ్‌, క్రిస్టల్‌ జెల్‌, బ్లాక్‌ రాక్‌, రెడ్‌ రోజ్‌, రిలాక్స్‌ థెరపీ, హీల్‌ పీల్‌, మానిక్యూర్‌లో క్రిస్టల్‌ క్లియర్‌, బ్లాక్‌ కాఫీ, సీవీడ్‌ తదితర సేవలు అందజేస్తున్నామన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివిధ విభాగాల గదులలో అనుభవజ్ఞులైన టెక్నీషియన్స్‌, బ్యూటీషిన్స్‌, సిబ్బందితో అత్యాధునిక ఎక్విప్‌మెంట్స్‌తో సుమారు రెండు సిట్టింగ్‌లలోనే రిజల్స్‌ను చూపే విధంగా కృషి చేస్తున్నామన్నారు. మెంబర్‌షిప్‌ కార్డ్‌ తీసుకున్న వారికి సుమారు 25 నుండి 30 శాతం డిస్కౌంట్‌ అలాగే పెళ్ళికూతురుగా తయారు చేయడానికి కాంబో సర్వీస్‌ సేవలు అందజేస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని స్థానికులే కాకుండా చుట్టు ప్రక్కల ప్రాంతాలు వారు కూడా వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో కస్టమర్లతో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *