Breaking News

నవంబర్ 11 వ తేదీ సోమవారం కలెక్టరేట్ లో పి జి ఆర్ ఎస్

-కలెక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి సోమవారం నిర్వహించే  జిల్లా, డివిజన్, మండల  స్థాయి పి జి ఆర్ ఎస్ కార్యక్రమం నవంబర్ 11 వ తేదీ సోమవారం యధావిధిగా  నిర్వహిస్తున్నట్లు   జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించే పి జి ఆర్ ఎస్ కార్యక్రమానికి అందరూ జిల్లా స్థాయి అధికారులు తప్పని సరిగా హాజరు కావాలని అన్నారు. జిల్లా కలెక్టర్, ఇతర జిల్లా అధికారులు  ఉదయం 10.00 నుంచి మ.1.00 వరకు ఫిర్యాదులను కలెక్టరేట్ లో స్వీకరిస్తామని కలెక్టర్ తెలిపారు. రెవెన్యూ, మునిసిపల్, మండల, గ్రామ, వార్డు సచివాలయాలలో  ప్రజా సమస్యలు పరిష్కార వేదిక లో ఫిర్యాదులు అందచేయాలని కలెక్టర్ తెలియచేశారు.  మండల స్థాయి  అధికారులు అందరూ  మండల ప్రధాన కేంద్రంలో ఒకే చోట హాజరై ప్రజల నుంచి స్పందన అర్జీలు స్వీకరించాలన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *