తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జనరల్ నర్సింగ్ మిడ్వైఫరి(GNM) మరియు బి ఎస్సీ నర్సింగ్ (B.Sc Nursing) పూర్తిచేసిన నిరుద్యోగ యువతకు జర్మనీ దేశం లో ఉద్యోగాలు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (APSSDC), OMCAP మరియు SM Care Solutions GmbH ద్వారా జర్మన్ భాషా లో శిక్షణ మరియు జర్మనీ దేశంలో ఉద్యోగ కల్పనా కార్యక్రమం.
అర్హత ప్రమాణాలు
విద్యార్హత
జిఎన్‌ఎం, బిఎస్సి నర్సింగ్
వయస్సు
35 సంవత్సరాలు లోపు
అనుభవం
బిఎస్సి – 2 సంవత్సరాలు, జిఎన్‌ఎం – 3 సంవత్సరాలు
అభ్యర్థులు జర్మనీలో పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి
శిక్షణ వ్యవధి: 6 నెలలు
*శిక్షణ ఇచ్చు ప్రదేశం:*స్విమ్స్ నర్సింగ్ కాలేజ్, తిరుపతి
శిక్షణ వివరాలు:
జర్మన్ భాష లో A1, A2, B1, B2 స్థాయిలు
కాషన్ డిపాజిట్
ఆసక్తి కలిగిన అభ్యర్థులు వారి ఒరిజినల్ సర్టిఫికెట్లు APSSDC వారికి సబ్మిట్ చెయ్యాలి
ఈ డిపాజిట్/సర్టిఫికేట్ లు సబ్మిట్ చేయడం అభ్యర్థులు తమ శిక్షణ లో గైర్హాజరు నివారించడానికి మరియు కోర్స్ నుండి డ్రాప్‌ఔట్ నివారించడానికి నిర్దేశించబడింది.
పూర్తి హాజరు తో శిక్షణ విజయవంతంగా ముగించుకుని సదరు అభ్యర్థులు జర్మనీ వీసా పొందిన తర్వాత ఆ సర్టిఫికెట్స్ తిరిగి చెల్లించబడుతుంది.
శిక్షణా కార్యక్రమం యొక్క వివరాలు
శిక్షణ
రెసిడెన్షియల్ మరియు డే స్కాలర్స్
భోజనం మరియు వసతి అభ్యర్థులు చెల్లించాలి
ట్రాన్స్లేషన్ / Anerkennung రుసుము మొదటి సారి ఉచితం
B2 పరీక్ష ఫీజు
మొదటి సారిగా హాజరు అయ్యే సమయంలో ఆ ఫీజును అభ్యర్థులు చెల్లించాలి.
వీసా వచ్చిన తర్వాత వారు అభ్యర్థులకు తిరిగి చెల్లిస్తారు.
మొదటి సారి విజయవంతం కానీ సందర్భం లో 2వ మరియు తదుపరి ప్రయత్నాల కోసం చెల్లించే ఫీజులను SM Care Solutions GmbH తిరిగి చెల్లించదు.
ఆర్థిక సహకారం
ఎంపికైన అభ్యర్థుల యొక్క వీసా ఫీజు, మరియు రాను పోను విమాన టిక్కెట్లు SM Care Solutions GmbH వారు చెల్లిస్తారు.
జీతం
జర్మనీ లో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు సుమారు యూరో €2400 నుండి €3500 వరకు లభించవచ్చు. (భారత కరెన్సీ లో సుమారు ₹2,33,000 నుండి ₹3,26,000 వరకు)
కావలసిన పత్రాలు:
బయోడేటా, విద్యా సర్టిఫికేట్లు, పాస్‌పోర్ట్, ట్రాన్స్క్రిప్ట్ సర్టిఫికెట్, జననం ధృవీకరణ పత్రం, అనుభవ సర్టిఫికెట్, వివాహ ధృవీకరణ పత్రం, నోటరీ లెటర్, నర్సింగ్ కౌన్సిల్ సర్టిఫికెట్, కోవిడ్ మరియు MMR సర్టిఫికెట్
ఎంపిక ప్రక్రియ:
1. ప్రాథమిక పరీక్ష: నర్సింగ్ పరిజ్ఞానం, ప్రాథమిక ఇంగ్లీష్ మరియు డిజిటల్ నైపుణ్యాలు లో ప్రాథమిక పరీక్ష ఉంటుంది.
2. ఇంటర్వ్యూ: ప్రాథమిక పరీక్ష లు అర్హత పొందిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపికచేస్తారు.
రిజిస్ట్రేషన్ కొరకు కింది లింక్ ను క్లిక్ చేయండి. https://forms.gle/F47HvQ7A32R8nxfu8
మరియు
కింది సూచించిన ఈమెయిల్ కు రెస్యూమ్ పంపించాలి. skillinternational@apssdc.in
దయచేసి గమనించగలరు రిజిస్ట్రేషన్ చివరి తేదీ 27-11-2024
శిక్షణా తరగతులు ప్రారంభ తేదీ 01-12-2024
మీ సందేహాలకు దయచేసి కింది సూచించిన నంబర్ కు కాల్ చేయగలరు
కాల్ సెంటర్ నంబర్: 99888 53335.