విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వతంత్ర భారతదేశం తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ 136వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి వైసీపీ శ్రేణులతో కలిసి ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ మౌలానా ఆజాద్ రాజకీయ రంగంలో స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అని అన్నారు..విద్యావ్యవస్థ పటిష్టతకు,ప్రాథమిక విద్యను ప్రోత్సహించారు అని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీ లకు ఎంతగానో కృషి చేసిందని అన్నారు. ఆజాద్,అంబేద్కర్, మహాత్మా గాంధీ గార్ల స్ఫూర్తితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చారన్నారు.గ్రామ స్వరాజ్యం లా సచివాలయలు తీసుకొచ్చిన ఘనత వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారిదే. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రామిరెడ్డి,వైసీపీ నాయకులు మీర్ హుస్సేన్,రిజ్వాన్,మెహబూబ్,భీమిశెట్టి బాబు,సుభాషిణి,కోటి నాగులు,రాజేష్,కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
చంద్రబాబుతోనే రాయలసీమ అభివృద్ధి
-రాష్ట్ర బీసీ శాఖ మంత్రి ఎస్.సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సీఎం చంద్రబాబుతోనే రాయలసీమ అభివృద్ధి చెందుతోందని …