Breaking News

పరమపవిత్రం కార్తీక మాసం

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కార్తీక సోమవారంను పురస్కరించుకుని గవర్నర్ పేటలోని అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం నందు వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాంత్రిక జీవనంలో కార్తీకమాసం కొత్త శోభను తీసుకువస్తుందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఈ మాసంలో ఆచరించే దీపారాధనలు, ఉపవాస దీక్షలు, కార్తీక పురాణ పఠనం, నదీ హారతి, జ్వాలాతోరణం జన్మజన్మల పాపాన్ని తొలగిస్తాయన్నారు. అలాగే శక్తికొలది చేసే దానం ఎంతో పుణ్య ఫలాన్ని ఇస్తుందన్నారు. సృష్టి లయకారుడు, ఓంకార స్వరూపుడైన శంకరుని భక్తి ప్రపత్తులతో ధ్యానిస్తే కష్టాలన్నీ తొలగిపోయి.. సకల శుభాలు కలుగుతాయన్నారు. ఆ ముక్కంటి కరుణా కటాక్షాలు నియోజకవర్గ ప్రజలపైన, వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైన ఎల్లవేళలా ఉండాలని కాంక్షించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *