విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బాలల సంపూర్ణ ఆరోగ్య రక్ష కార్యక్రమం ద్వారా చిన్నతనంలోనే వ్యాధులు, లోపాలను గుర్తించి సత్వర చికిత్స అందించడం ద్వారా ఆరోగ్య ఆంధ్ర ప్రదేశ్ నిర్మాణ దిశగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు.
నగరంలోని పటమట స్థానిక కోనేరు బసవయ్య చౌదరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం బాలల సంపూర్ణ ఆరోగ్య రక్ష కార్యక్రమాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మంత్రి మాట్లాడుతూ రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమంలో భాగంగా బాలల సంపూర్ణ ఆరోగ్య రక్ష కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. దీని ద్వారా జననం నుండి 18 సంవత్సరాల వయస్సు కలిగిన పిల్లలో 44 ఆరోగ్య సమస్యలకు పరీక్షలు నిర్వహించి ఉచిత చికిత్సను అందించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీలు, పాఠశాలలు, ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న 68 లక్షల మంది పిల్లలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. వీటిలో ముఖ్యంగా పుట్టుకతో, బాల్యంలో వచ్చే లోపాలు, చిన్ననాటి వ్యాధులు, వైకల్యాలతో ఎదుగుదల ఇబ్బందులు తదితర వ్యాధులను ప్రతి పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలలో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలలోని చిన్నారులకు ఆరోగ్య కార్యకర్త ద్వారా వైద్య పరీక్షలను నిర్వహించి లోపాలను గుర్తించి ఉచిత చికిత్స అందిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ (డిఇఐసి)లు, 639 భవిత సెంటర్ల ద్వారా గ్రహణం ముర్రీ, కంటి, గుండెకు సంబంధించిన వ్యాధులను గుర్తించి చికిత్స అందించడం జరుగుతుందన్నారు. బాలల సంపూర్ణ ఆరోగ్య రక్ష కార్యక్రమం ద్వారా ఆరోగ్య ఆంధ్ర ప్రదేశ్ దిశగా 2047 స్వర్ణాంద్ర ప్రదేశ్ కలను సాకారం చేయడంలో అందరు భాగ్యస్వాములు అవుదామన్నారు. శారీరకంగా, మానసికంగా అందరూ ఆరోగ్యంగా ఉంటే రాష్ట్ర దేశ భవిష్యత్ ఉన్నతంగా ఉంటుందన్నారు. రక్తహీనతతో బాలింతలు బాధపడడం వల్ల పిల్లలో ఎదుగుదల సమస్య ఉంటుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అనేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై అవగాహన పెంచుకుని సద్వినియోగం చేసుకోవాలన్నారు. యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండి భవిష్యత్‌కు బంగారు బాట వేసుకోవాలన్నారు. ఆరు నెలల పాటు నిర్వహించే ఈ క్రార్యక్రమంలో విద్య, వైద్య ఆరోగ్య, స్రీ శిశు సంక్షేమ శాఖ భాగస్వాములై ఆరోగ్య వంతమైన రాష్ట్రాన్ని నిర్మించుకోవడంలో భాగస్వాములు కావాలని మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు.
సభకు అధ్యక్షత వహించిన స్థానిక శాసన సభ్యులు గద్దె రామ్మోహనరావు మాట్లాడుతూ ప్రతి పేదవానికి వైద్యం, విద్య చేరువ చేయాలని తద్వారా సామాజం అభివృద్ధి చెందుతుందనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనేక కార్యక్రమాలకు శ్రీకారం చూట్టారన్నారు. వైద్య ఖర్చు బారం కాకుడదని అన్ని విధాలుగా ఖర్చు లేకుండా ఉచితంగా వైద్యాన్ని అందిస్తున్నామన్నారు. నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 2014`2019 సంవత్సరంలో నిధులను మంజూరు చేసి వెంటిలేటర్లు వంటి అన్ని రకాల వైద్య సౌకర్యాలు, పరికరాలు, కల్పించామన్నారు. ఇటీవల పేద, మధ్య, ఉన్నత తరగతి వర్గాలలో తక్కువ బరువు, గుండె సంబంధిత వ్యాధులతో పుట్టే పిల్లల సమస్య ఎక్కువగా ఉందని ఇందుకు ఇంక్యుబేటర్ మిషన్‌లో ఉంచే సౌకర్యానికి ఒక్కోక్క రోగికి సుమారు 10 లక్షలు ఖర్చు అవుతుందని దీనిని దృష్టిలో ఉంచుకుని పూర్తి సామర్ద్యంతో పిల్లల వార్డులలో ఇంక్యుబేటర్ మిషన్ సౌకర్యం కల్పించాలని శాసన సభ్యులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
వైద్య ఆరోగ్య కుంటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ యం.టి. కృష్ణబాబు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడే పుట్టిన బాలల నుండి 18 సంవత్సరాల లోపు వయసు కలిగిన 68 లక్షల పిల్లలకు బాలల సంపూర్ణ ఆరోగ్య రక్ష ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీలలో చదువుకుంటున్న 28 లక్షల మంది, పాఠశాలలు, ఉన్నత విద్యా సంస్థలలో చదువుకుంటున్న 48 లక్షలు మంది పిల్లలకు 44 ఆరోగ్య సమస్యల పరీక్షలు, ఉచిత చికిత్స అందించడం జరుగుతుందన్నారు.
పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయ్ రామరాజు, మహిళా, శిశు విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్దుల సంక్షేమ శాఖ కార్యదర్శి ఎ. సూర్య కుమారి మాట్లాడుతూ ఆయా శాఖల తరుపున వైద్య ఆరోగ్య శాఖకు పూర్తి సహకారం అందిస్తామన్నారు.
అనంతరం బాలల సంపూర్ణ ఆరోగ్య రక్ష కార్యక్రమంపై అవగాహన పోస్టర్లను కర పత్రాలను మంత్రి విడుదల చేశారు.
కార్యక్రమంలో వైద్య ఆరోగ్య కుంటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ వాకాటి కరుణ, జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ నిధి మీనా, ఆర్‌డివో సి.హెచ్ చైతన్య, డిఎమ్ అండ్ హెచ్‌వో యం సుహాసిని, ఐసిడిఎస్ పిడి జి. ఉమాదేవి, కెబిసిహెచ్ జెడ్‌పిహెచ్ ఎస్ హెచ్‌యం జి. ఎస్తేరు రాణి పాల్గొన్నారు.
తొలుత ఆర్‌బిఎస్‌కె, ఆర్‌కెఎస్‌కె ఫోటో ఎగ్జిబిషన్‌ను, డిఇఐసి అన్‌లైన్ ఇంటరాక్షన్, లైవ్ స్క్రీనింగ్‌ను మంత్రి ప్రారంభించారు.
Tags vijayawada
Check Also
ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …