-ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు నైతిక విలువల ప్రభుత్వ సలహాదారు, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
-ప్రభుత్వ ప్రతినిధిగా చాగంటి ని మర్యాదపూర్వకంగా కలిసిన సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థుల నైతిక విలువల ప్రభుత్వ సలహాదారుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించినందుకు చాలా ఆనందంగా ఉందని, విద్యాశాఖతో భాగస్వామ్యం అవుతూ, విద్యార్థులకు చదువుతో పాటు నైతిక విలువలు నేర్పించే గొప్ప బాధ్యత ఎంతో శ్రేష్ఠమైనది బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS., తెలిపారు. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచన కర్త, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు కి కేబినెట్ ర్యాంక్‌తో పోస్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేఫథ్యంలో శుక్రవారం కాకినాడలోని చాగంటి కోటేశ్వరరావు నివాసానికి సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS., రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతినిధిగా వెళ్లి, మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయనకు అభినందనలు తెలియజేస్తూ పుష్పగుచ్ఛం అందజేశారు.
ఈ సందర్భంగా తన పదవీకాలంలో విద్యార్థిలోకానికి సత్ప్రవర్తన, నడవడిక, నైతిక విలువలతో నేర్పే కర్తవ్యాన్ని తనకు అప్పగించినందుకు ప్రభుత్వానికి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు కృతజ్ఞతలు తెలిపారు. తర్వలో విద్యాశాఖామాత్యులు నారా లోకేష్ ని కలుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్షా ఎస్పీడీ తో పాటు కాకినాడ ఆర్జేడీ జి.నాగమణి పాల్గొన్నారు.