-సామాజిక చైతన్యం కోసం, సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం తపిస్తూ నిష్పక్షపాతంగా పని చేస్తున్న పాత్రికేయ మిత్రులందరికీ జాతీయ పత్రికా దినోత్సవ (నేషనల్ ప్రెస్ డే) శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
-సమాజ పురోగతికి, సమాజ చైతన్యానికి పత్రికల ఆవశ్యకత ప్రధానమని పేర్కొన్న మంత్రి కందుల దుర్గేష్
-పాత్రికేయ రంగం నిష్పక్షపాతంగా ముందుకు వెళ్లాలని ఆకాంక్షించిన మంత్రి దుర్గేష్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజ పురోగతికి, సమాజ చైతన్యానికి పత్రికల ఆవశ్యకత ప్రధానమని జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. సమాజంలో రుగ్మతలను రూపుమాపడానికి పాత్రికేయులు చేసే కార్యక్రమాలు మార్గదర్శకమని పేర్కొన్నారు. పత్రికా స్వేచ్ఛను కాపాడే బాధ్యత అందరిపై ఉందని, ముఖ్యంగా రాజకీయ నాయకులపై ఉందని తెలిపారు. పత్రికలు పదికాలాలపాటు నిలబడితే తద్వారా చైతన్యం తీసుకొచ్చేందుకు అవకాశముంటుందన్నారు. మారుమూలన ఉన్న పాత్రికేయ మిత్రులు కూడా ఎన్నో సాహసోపేత కార్యక్రమాల ద్వారా ప్రజా జీవితాలను రంజింప చేస్తున్నారన్నారు. పత్రికా స్వేచ్ఛను కాపాడటం తమ విద్యుక్త ధర్మంగా భావిస్తున్నామన్నారు. పాత్రికేయ రంగం నిష్పక్షపాతంగా ముందుకు వెళ్లాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. పత్రికొక్కటున్న పదివేల సైన్యంబు అన్నట్లు సామాజిక చైతన్యం కోసం, సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం తపిస్తూ నిష్పక్షపాతంగా పని చేస్తున్న పాత్రికేయ మిత్రులందరికీ జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ శుభాకాంక్షలు తెలిపారు.