Breaking News

Tag Archives: AMARAVARTHI

భాకరాపురంలో ఓటు వేసిన సీఎం జ‌గ‌న్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సీఎం జ‌గ‌న్ త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. పులివెందుల భాకరాపురంలోని జయమ్మ కాలనీలో అంగన్వాడి రెండో సెంటర్లో 138 బూత్ నెంబర్ లో తమ ఓటు హక్కును వినియోగించున్నారు. ఆయ‌న‌తో ఆమె స‌తీమ‌ణి భార‌తీ కూడా ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు.

Read More »

ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : టీడీపీ ఛీఫ్​ చంద్రబాబు తన కుటుంబసభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉండవల్లిలోని పోలింగ్‌ కేంద్రంలో టీడీపీ అధినేత నారా భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి కలిసి ఓటు వేశారు. కుటుంబంతో కలిసి పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన చంద్రబాబు ఓటు వేసి అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఓటు వేసేందుకు జనం చూపిస్తున్న చొరవ మరిచిపోలేనిదని అన్నారు. ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవి అన్న చంద్రబాబు.. భవిష్యత్తును తీర్చిదిద్దేది ఎన్నికలే అని ప్రజలు …

Read More »

కిడ్నాపైన తెదేపా ఏజెంట్లను గుర్తించి విధులకు హాజరపరచడమైంది…

-రాష్ట్ర ప్రధాని ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నేడు రాష్ట్రవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం బోరకమందలో తెదేపాకు చెందిన ముగ్గురు ఏజెంట్లు కిడ్నాప్ అయినట్లు వచ్చిన ఆరోపణపై జిల్లా ఎన్నికల యంత్రాంగం తో పాటు పోలీసుల యంత్రాంగం వెంటనే స్పందించడం జరిగిందని రాష్ట్ర ప్రధాని ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా తెలిపారు. కిడ్నాపైన తెదేపా ఏజెంట్లను పోలీసులు పీలేరులో గుర్తించి, వారిని వెంటనే విధులకు …

Read More »

ఓటు హక్కును వినియోగించుకున్న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా నేటి ఉదయం 7.30 గంటలకు తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో రైల్వే ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన 155- సూర్యారావుపేట పోలింగ్ స్టేషన్ లో వారు తమరు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Read More »

తెనాలి, మాచర్ల, అనంతపురం లో జరిగిన సంఘటలను తీవ్రంగా పరిగణించిన ఈసీ…

-గృహనిర్బంధంతోపాటు కేసులు పెట్టాలని ఆదేశం -పుంగనూరులో నిందితులను వదిలేసిన ఎస్ఐ ని సస్పెండ్ చేయాలని ఆదేశం -సాయంత్రం 4 – 6 గంటల మధ్య ఎట్టువంటి సంఘటనలు జరిగినా చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నేడు రాష్ట్రంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పలుచోట్ల పలు దుర్ఘటనలు జరగడాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారం ముఖేష్ కుమార్ మీనా తీవ్రంగా పరిగణించారు. తెనాలి, మాచర్ల, అనంతపురం లో జరిగిన సంఘటలకు బాధ్యులైన వారిని వెంటనే గృహ నిర్బంధం …

Read More »

ఎటువంటి దొమ్మీ లేకుండా ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగం… : ముఖేష్ కుమార్ మీనా

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఓటింగ్ ప్రక్రియ ముగిసే నిర్ణీత సమయానికి కల్లా క్యూలైన్లో ఉన్న వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించబడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు.  రంపచోడవరం, పాడేరు, అరుకు నియోజకవర్గాల్లో సా. 4.00 గంటలకు మరియు పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సా. 5.00 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ముగిసినప్పటికీ, క్యూలైన్లో ఉన్న వారందరికీ ఓటు హక్కును వినియోగించుకునే …

Read More »

మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్న పవన్ కళ్యాణ్ 

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంగళగిరి నియోజకవర్గం పరిధిలో పవన్ కళ్యాణ్ కి ఓటు ఉంది. సోమవారం ఉదయం 9 గంటలకు మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహా కాలనీ, గిరిజన సహకార సంస్థలో ఏర్పాటు చేసిన బూత్ నంబర్ 197లో ఓటు వేశారు. అనంతరం పోలింగ్ కేంద్రం వెలుపల ఓటు హక్కు వినియోగించుకున్నట్టు సిరా గుర్తు ఉన్న వేలును చూపుతూ అభిమానులకు, కార్యకర్తలకు అభివాదం చేశారు. ప్రశాంత వాతారణంలో …

Read More »

పోలింగ్ కేంద్రం, ఓటు ఎక్కడుందో తెలుసుకోండిలా..!!

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పోలింగ్ స్టేషన్ కనుగొనేందుకు ఈ కింది సూచనలు పాటించండి. ఇప్పుడు దాదాపు అంతా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. ప్లే స్టోర్ నుంచి ఓటర్ హెల్ప్ లైన్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. యాప్‌లో నో యువర్ పోలింగ్ స్టేషన్ విభాగంలో ఓటరు వివరాలను నమోదు చేయాలి. ఓటరు ఐడీ, పోలింగ్ కేంద్రం వివరాలు నమోదు చేస్తే ప్రస్తుత పోలింగ్ స్టేషన్ వివరాలు మీ మొబైల్ స్ర్కీన్ మీద కనబడతాయి. దానిని సేవ్ చేసుకొని, లేదంటే స్ర్కీన్ షాట్ …

Read More »

ఈనెల 13న పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి 14న ప్రత్యేక క్యాజువల్ లీవ్ (ఆన్ డ్యూటి) : సిఇఒ మీనా

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 13న జరిగే పార్లమెంట్,అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఆ మరుసటి రోజు అనగా 14వ తేది మంగళవారం ప్రత్యేక క్యాజువల్ లీవ్(ఆన్ డ్యూటి) సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా తెలియ జేశారు.ఈమేరకు సంబంధిత లీవ్ శాంక్సనింగ్ అధారిటీలు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. 13న ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఆ మరుసటి రోజు 14న ప్రత్యేక క్యాజువల్ లీవ్(ఆన్ డ్యూటి)గా పరిగణించాలని ఎపి ఎన్జీవో, …

Read More »

చివరి 72 గంటల్లో, పోలింగ్ రోజు చేయాల్సిన ఏర్పాట్లు ఇవే

-రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 13న జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అన్ని జిల్లా ఎన్నికల యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం చివరి 72 గంటల్లో మరియు పోలింగ్ రోజు చేయాల్సిన ఏర్పాట్లను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఒక ప్రకటనలో వివరించారు. హింసకు, రీపోలింగ్ కు తావు లేకుండా ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో న్యాయంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యూహాత్మకమైన చర్యలు చేపట్టాలని …

Read More »