Breaking News

Tag Archives: AMARAVARTHI

గ్రామ వార్డు సచివాలయాల మహిళా పోలీస్ ను పోలీస్ శాఖలో ఇంటిగ్రేషన్ పై సిఎస్ సమీక్ష

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ వార్డు సచివాలయాలలో నియమించబడిన మహిళా పోలీస్ ను పోలీస్ శాఖలో ఇంటిగ్రేషన్ చేసే అంశంపై గురువారం అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. ఈసమావేశంలో డిజిపి గౌతం సవాంగ్ మాట్లాడుతూ గ్రామ,వార్డు సచివాలయాల్లో నియమించిన మహిళా పోలీస్ ను ఏవిధంగా పోలీస్ శాఖలో ఇంటిగ్రేట్ చేయాలి అందుకు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై వివరించారు.ముఖ్యంగా ఇందుకు సంబంధించిన సర్వీస్ నిబంధనలకు రూపకల్పనకు గాను స్పెషల్ రూల్స్ …

Read More »

ఈ నెల 21, 22 తేదీల్లో వాణిజ్యఉత్సవ్-2021

-వాణిజ్య ఉత్సవ్ ను ప్రారంభించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి -విజయవాడ ఎస్.ఎస్.కన్వెషన్ వేదికగా రాష్ట్ర వాణిజ్యం, ఎగుమతుల కార్నివాల్ -2030 నాటికి ఎగుమతులను రెట్టింపు చేయాలనే లక్ష్యంతో చర్యలు -ప్రాసెసింగ్, విలువ జోడింపు ద్వారా వ్యవసాయ ఎగుమతులపై ప్రత్యేక దృష్టి -ఉత్సవ్ లోగో, పోస్టర్, ఇన్విటేషన్ ఆవిష్కరణతో పాటు రిజిస్ట్రేషన్కు ప్రత్యేక వెబ్సైట్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వాణిజ్య ఉత్పత్తులను మెరుగు పర్చి తద్వారా ఎగుమతులను మరింత ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ నెల 21, 22 తేదీల్లో వాణిజ్య ఉత్సవ్-2021 …

Read More »

మంత్రి మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను గురువారం అమరావతి సచివాలయం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌరసంబంధాలు మరియు రవాణాశాఖ మాత్యులు పేర్ని వెంకట్రామయ్య(నాని)మీడియాకు వివరించారు. 1.ఏపీ స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌లో రుణాలు తీసుకున్న వారికి ఒన్‌టైం సెటిల్‌మెంట్‌ పథకాన్ని ఆమోదించిన రాష్ట్ర మంత్రివర్గం ఒన్‌టైం సెటిల్‌మెంట్‌లో చెల్లింపులు చేసిన పూర్తి హక్కులను దఖలు పరచనున్న ప్రభుత్వం వడ్డీరేట్లు,ప్రిన్సిపల్‌ అమౌంట్ల భారం తదితర అంశాలు కారణంగా దీర్ఘకాలంలో పెండింగులో బకాయిలు …

Read More »

బడ్జెట్ అంచనాల మేరకు పన్ను వసూళ్లు…

-ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్ భార్గవ -పన్ను వసూలులో మెరుగైన ఫలితాలకు ఎన్ ఫోర్స్ మెంట్ సద్వినియోగం -జిఎస్టీ సమస్యలపై పరిష్కారానికి కౌన్సిల్ సమావేశం వేదిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బడ్జెట్ అంచనాల మేరకు పన్ను వసూలుపై దృష్టి సారించాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్ భార్గవ స్పష్టం చేసారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయ వనరుల సేకరణలో ఎటువంటి అలసత్వం కూడదని హెచ్చరించారు. పన్ను వసూలులో మెరుగైన ఫలితాలు సాధించటానికి ఎన్‌ఫోర్స్ మెంట్ …

Read More »

అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే సినిమా టికెట్ల ఆన్లైన్ విక్రయంపై ప్రభుత్వ నిర్ణయం…

-త్వరలో సినిమా నిర్మాతలు, డైరెక్టర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ధియేటర్ యజమానులతో సమావేశం -ఈఅంశంపై సంబంధిత వర్గాలతో సంప్రదింపులు జరుగుతున్నాయి, త్వరలో సియం సమక్షంలో సమావేశం -ఆన్లైన్ టికెట్ల విక్రయంతో అధిక ధరలు, బ్లాక్ టికెట్లు అమ్మకం, ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను ఎగవేతను అరికట్టవచ్చు -తెలుగు సినీపరిశ్రమకు అనేక ప్రోత్సాహకాలు, పరిశ్రమను రాష్ట్రానికి తెచ్చేందుకు కృషి -రాష్ట్ర సమాచారశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో సినిమా టికెట్లను ఆన్లైన్ ద్వారా విక్రయించే అంశాన్ని సినిమా పరిశ్రమకు చెందిన పలువురు నిర్మాతలు,డిస్ట్రిబ్యూటర్లు,ధియేటర్ల …

Read More »

నైపుణ్య ఆధారిత శిక్షణతో నిరుద్యోగ యువత భవితకు బంగారు బాటలు…

– పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నిరుద్యోగ యువతకు శిక్షణ -స్కిల్ డెవలప్మెంట్ పార్ట్ నర్స్ గా ప్రముఖ పరిశ్రమలు -ఏపి విధానానికి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్డిసి) నుంచి అభినందనలు -స్కిల్ ఎకోసిస్టమ్ ను అభివృద్ధి చేయడంలో భాగంగా ఐబిఎం, టెక్ మహీంద్రా, దాల్మియా, డెల్, హెచ్. సి.ఎల్ తదితర 13 ప్రముఖ సంస్థలతో ఒప్పందం -రూ.460 కోట్లతో ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో 23 నైపుణ్య కళాశాలలు -ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా పులివెందులలో ఒక స్కిల్ ఇనిస్టిట్యూట్ కు …

Read More »

కుటుంబం పిల్లల మొదటి పాఠశాల…తల్లి అతని మొదటి గురువు…

-పిల్లలలో మంచి విలువలను పెంపొందించడంలో తల్లిదండ్రుల ముఖ్య పాత్ర… అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పిల్లలలో మంచి విలువలను పెంపొందించడంలో తల్లిదండ్రుల పాత్ర ముఖ్యమైనది. కుటుంబం పిల్లల మొదటి పాఠశాల, అక్కడ నుండి వారు జీవితం యొక్క మొదటి పాఠం నేర్చుకుంటారు. తల్లి అతని మొదటి గురువు. కానీ నేటి యుగంలో తల్లిదండ్రులు పిల్లలకు మంచి విలువలు ఇవ్వడం.. నేర్పించడం కష్టంగా మారింది. మీరు పిల్లలకు ఎంత వివరించినా, వారు దానిని పాటిస్తారు అనే నమ్మకం లేదని అనుకుంటారు. కానీ, పిల్లలకు తల్లిదండ్రులు నేర్పిన …

Read More »

వృధ్ధాచలం (విరుదాచలం)… కాశీకంటే పురాతనమైన పుణ్యక్షేత్రం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తమిళనాడులోని ఓ పుణ్యక్షేత్రం కాశీ క్షేత్రం కంటే పురాతనమైనది. అందువల్లే ఇక్కడ స్వామివారిని పూజిస్తే కాశీలో విశ్వనాధుడిని సేవించిన దానికంటే ఎక్కువ పుణ్యం వస్తుందని నమ్ముతారు. అంతేకాకుండా ఇక్కడ పుట్టినా, చనిపోయినా అప్పటి వరకూ చేసిన తప్పులు సమిసిపోయి తప్పక కైలాసానికి వెలుతామని ప్రతీతి. అందుకే కాశీలో జీవిత చరమాంకం గడపడానికి వీలుకుదరని వారు ఇక్కడికి వచ్చి దైవ సన్నిదిలో తమ శేష జీవితాన్ని ముగిస్తారు. ఈ నేపథ్యంలో ఆ దేవాలయానికి సంబంధించిన కథనం. వృద్దాచలాన్ని, వృద్ధకాశి …

Read More »

విద్యాశాఖలో నాడు–నేడుతో పాటు పౌండేషన్‌ స్కూళ్లుపై సమీక్ష…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విద్యాశాఖలో నాడు–నేడుతో పాటు పౌండేషన్‌ స్కూళ్లుపై రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క్యాంప్‌ కార్యాలయంలో  మంగళవారం సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ నూతన విద్యావిధానం అమలుపై అన్నిరకాలుగా సిద్ధంకావాలని, ఆ దిశగా అడుగులు ముందుకేయాలని సీఎం ఆదేశించారు. పాఠ్యపుస్తకాల ముద్రణ నాణ్యతను పెంచాలి: అధికారులకు సీఎం ఆదేశించారు. కనీసం మూడో తరగతి నుంచి సబ్జెక్టుల వారీగా టీచర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం అన్నారు. సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌పైనా సీఎంకు వివరాలు అధికారులు …

Read More »

క్లాప్, గ్రీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆర్కే…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరి పట్టణంలో గల ఇందిరా నగర్ 4వ సచివాలయం పరిధిలో ఎమ్మెల్యే ఆర్కే  క్లాప్, గ్రీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో మంగళవారం పాల్గొని ఇంటి ఇంటికి తిరిగి ఎమ్మెల్యే ఆర్కే, MTMC అధికారులు డస్ట్ బిన్ లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ పర్యావరణం, పరిశుభ్రంగా ఉండాలని CM జగన్మోహనరెడ్డి  క్లాప్, గ్రీన్ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమాన్ని ప్రాంభించారని అన్నారు. దాదాపు 1 కోటి 70 లక్షల రూపాయలతో MTMC పరిధిలో ప్రతి ఇంటికి మూడు …

Read More »