Breaking News

ఈ నెల 21, 22 తేదీల్లో వాణిజ్యఉత్సవ్-2021

-వాణిజ్య ఉత్సవ్ ను ప్రారంభించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి
-విజయవాడ ఎస్.ఎస్.కన్వెషన్ వేదికగా రాష్ట్ర వాణిజ్యం, ఎగుమతుల కార్నివాల్
-2030 నాటికి ఎగుమతులను రెట్టింపు చేయాలనే లక్ష్యంతో చర్యలు
-ప్రాసెసింగ్, విలువ జోడింపు ద్వారా వ్యవసాయ ఎగుమతులపై ప్రత్యేక దృష్టి
-ఉత్సవ్ లోగో, పోస్టర్, ఇన్విటేషన్ ఆవిష్కరణతో పాటు రిజిస్ట్రేషన్కు ప్రత్యేక వెబ్సైట్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వాణిజ్య ఉత్పత్తులను మెరుగు పర్చి తద్వారా ఎగుమతులను మరింత ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ నెల 21, 22 తేదీల్లో వాణిజ్య ఉత్సవ్-2021 ను విజయవాడ లో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య మరియు ఐ.టి. శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. విజయవాడ ఎస్.ఎస్. కన్వెషన్ వేదిగా నిర్వహించనున్నఈ ఉత్సవ్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. గురువారం సచివాలయం బ్లాన్ నెం.4 లోని పబ్లిసిటీ సెల్లో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ ఈ ఉత్సవ్ నిర్వహణకు సంబందించిన విషయాలను వివరించారు. 75 సంవత్సరాల భారత స్వాతంత్య్రాన్ని పురస్కరించుకొని ఆజాదీకా అమృత్ మహాత్సవ్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర వాణిజ్య శాఖ వాణిజ్య సప్తాహ్ అనే కార్యక్రమాన్ని ఈ నెల 20 నుండి 26 వరకు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. భారత దేశంలో ఎగుమతుల ప్రోత్సాహం, ఆర్థిక అభివృద్ది అనే అంశాన్ని దృష్టిలో ఉంచుకొనిఈ వాణిజ్య సప్తాహ్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్రం సూచించిన నేపథ్యంలో రాష్ట్రంలో ఈ వాణిజ్య ఉత్సవ్ ను నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్లాస్టిక్ ఎక్స్ పోర్ట్సు ప్రొమోషన్ కౌన్సిల్ తో పాటు విజయవాడలో రెండు రోజుల పాటు ఈ ఉత్సవ్ ను నిర్వహిస్తున్నామని, ఈ నెల 24 నుండి 25 వ తేదీ వరకూ అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఇటు వంటి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఉత్పత్తుల ఎగుమతి విషయంలో స్టేట్ కంట్రిబ్యూషన్ ప్రస్తుతం 4 శాతం మాత్రమే ఉందని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు దాన్ని 2030 నాటికి 10 శాతానికి పెంచాలనే లక్ష్యంతో ఈ ఉత్సవ్ వేదిక పలు కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. పరిశ్రమలు, పెట్టుబడులు, వాణిజ్యాన్ని పెద్ద ఎత్తున ఆకర్షించడం, విదేశీ రాయబారులతో వరుస సమావేశాలు నిర్వహించడం, ఎమ్ఎస్ఎమ్ఈ రంగానికి మరింత అండదండ కల్పించడం, రాబోయే పెట్టుబడిదారులు, ఎగుమతిదారుల కోసం ఎక్స్ పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేయడం, పారిశ్రామిక, ఎగుమతిదారులలో సత్తా చాటిన వారిని గుర్తించి అవార్డులు అందించి ప్రోత్సహించడం, IEC (ఐఈసీ) రిజిస్ట్రేషన్లను స్పాట్ లో చేసేలా సులభతరం చేయడం వంటి తదితర కార్యక్రమాలను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పత్తులను పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు ఈ వాణిజ్య ఉత్సవాన్ని సద్వినియోగం చేసుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందన్నారు. ఎగుమతుల రంగానికి చెందిన దేశ విదేశాల్లోని పలువురు నిపుణులతో చర్చలు జరిపి వ్యవసాయ ఎగుమతులను పెద్ద ఎత్తున పెంచే అంశంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకై ప్రత్యేక సెషన్లను నిర్వహిస్తున్నామన్నారు. ఈ సెషన్లలో ఇండియన్ మిషన్ అబ్రోడ్ ప్రతినిధులు వర్చువల్ గాపాల్గొంటారని, దుబాయ్, ప్రాన్సు, లండన్, బంగ్లాదేశ్, బ్రిటన్,జర్మనీ దేశాలకు చెందిన రాయబారులు కూడా ఈ ఉత్సవ్ లో పాల్గొంటున్నట్లు మంత్రి తెలిపారు .
రాష్ట్ర జనాభాలో సుమారు 62 శాతం మంది వ్యవసాయమే జీవనోపాదిగా ఉన్నారని, వారి ఉత్పత్తులకు విలువను జోడించి ఎగువలు చేయడం ద్వారా రైతులకు మేలు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఉన్నారన్నారు. అందుకు అనుగుణంగా ప్రతి పార్లమెంటరీ నియోజక వర్గంలోనూ ఒక ప్రాసెసింగ్ పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈ సమావేశంలో భాగంగా వాణిజ్య ఉత్సవ్-2021 లోగో, పోస్టర్, ఇన్విటేషన్ కార్డును మంత్రులు ఆవిష్కరించారు, ఈ ఉత్సవ్ లో పాల్గొనే ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు, ఔత్సాహికులు ముందుగా తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక వెబ్సైట్ ను మంత్రులు ఈ సందర్బంగా ప్రారంబించారు. పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్.కరికల వలవన్, కమినషర్ జె.వి.ఎన్.సుబ్రహ్మణ్యం తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Check Also

మాకు న్యాయం చేయండి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగుల గృహ నిర్మాణ సంఘం పేరుతో ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మ్యూచువల్లీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *