ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త:
ఢిల్లీ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అనంతరం కేంద్ర రైల్వే, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశమై రాష్ట్రంలో చేపడుతున్న రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. ఏపీలో ప్రతిపాదించిన సెమీకండక్టర్ ప్రాజెక్టు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారం అందించే అంశాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం.