విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మాతృభాషను పదిలంగా భవిష్యత్తు తరాలకు అందించడమే లక్ష్యంగా జరిగిన ఆరవ తెలుగు రచయితల మహాసభలు ఆదివారంతో ఘనంగా ముగిసాయి. పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) ఆదేశాలతో సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ , సుజనా ఫౌండేషన్ సిబ్బందితో కలిసి అతిథులకు, ఆహ్వానితులకు భోజన ఏర్పాట్లు చేశారు. 1500 మందికి పైగా రచయితలు, ప్రతినిధులు, విద్యార్థులు మహాసభలలో పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్య కుమార్ యాదవ్, పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖామంత్రి కందుల దుర్గేష్ లకు ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ స్వాగతం పలికారు.తెలుగు రచయితల మహాసభలకు సహకారం అందించిన ఎమ్మెల్యే సుజనా చౌదరికి నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. పద్మభూషణ్ పురస్కార గ్రహీత యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్, ఎస్ కే పి వీవీ హిందూ హైస్కూల్ కమిటీ పరిపాలనాధికారి డాక్టర్ వంగల నారాయణరావు ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ను సన్మానించారు. ప్రముఖ మాటల రచయిత బొమ్మిన వెంకటరమణ పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) ని ప్రశంసిస్తూ అనువదించిన కవిత్వం పలువురిని ఆకట్టుకుంది.
Tags vijayawada
Check Also
ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …