–‘తల్లి ప్రేమ అనిర్వచనీయం…’
కొండూరి శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయుడు,
నేటి పత్రిక ప్రజావార్త, ఎడిటర్.
అమ్మలో బ్రహ్మ అంశ, విష్ణు అంశ, పరమశివుడి అంశ, ఈ మూడు అంశాలు ప్రచోదనమయి వుంటాయి. జీవితాంతం నిబడి ఉంటాయి. కాబట్టే అమ్మ తన కన్నబిడ్డకు పరదేవతే-పరబ్రహ్మమే. అమ్మకు చేసిన నమస్కారం పరబ్రహ్మానికి చేసిన నమస్కారమే. అమ్మకు చేసిన ప్రదక్షిణం పరబ్రహ్మానికి చేసిన ప్రదక్షిణమే. అమ్మ తనకు తాను ఉద్ధారకురాలు కాకపోవచ్చు. 95 ఏళ్ళ ముసలివగ్గయినా, తన అన్నం తాను తిన్నదో లేదో గుర్తు లేకపోయినా, తనకంటూ తాను ఏమీ చేసుకోలేకపోయినా, దీపం పెట్టుకోలేక పోయినా, స్తోత్రం చెప్పుకోలేక పోయినా, తనలో తానే ఏవో సంధిమాటు మాట్లాడుకుంటున్నా, తన బిడ్డకు మాత్రం ఉద్ధారకురాలే.. ఎలా అంటే అమ్మ అంటూ ఒక ఆకారం అక్కడ వుంటేనే కదా! కొడుకుకానీ, కూతురు కానీ వెళ్ళి ప్రదక్షిణం చేసుకుని ఆమె కాళ్ళకు నమస్కారం చేసుకోగలిగేది. ఒక వ్యక్తి అలా తన అమ్మకి ఒక్కసారి ప్రదక్షిణం చేస్తే ఆరుసార్లు భూప్రదక్షిణం, పదివేసార్లు కాశీయాత్ర చేసిన పుణ్యఫం దక్కుతుందని శాస్త్రం. బిడ్డకు ఇంత పుణ్యం ఇవ్వగలిగిన అమ్మ మాత్రం తనకంటూ తాను ఏమీ చేసుకోదు. అమ్మ ఉన్నది కాబట్టి మనకి ఆ పుణ్యం వస్తున్నది. అమ్మకు నమస్కారం చేయడం అంత గొప్ప ఫలితాన్నిస్తుంది. బాహ్యంలో ఎన్ని యజ్ఞాలు చేసినా, యాగాలు చేసినా, ఎన్నో చండీ హోమాలు చేసినా, దేవాలయాలు కట్టిచ్చినా, అన్నదానాలు చేసినా తల్లికి నమస్కారం చేస్తే వచ్చిన ఫలితంతో అవన్నీ సమానం కావు. ఆ ఫలితం అంతా ఇంతా అని చెప్పడము కుదరదు. అంటే చెప్పడం కష్టం. అమ్మ త్రిమూర్త్యాత్మక స్వరూపమై తనంతటతానుగా అంత పుణ్యాన్ని ఇవ్వగదు. అందుకే మాతృదేవోభవ. అందుకే అమ్మ దేవత. అమ్మే పరబ్రహ్మం. తల్లిని గౌరవించని వాళ్ళు లేరు. గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళూ, బ్రహ్మచారులు, వానప్రస్థులు అందరూ సన్యాసికి నమస్కరిస్తారు. మరి సన్యాసి ఎవరికి నమస్కరిస్తారు? చాతుర్మాస్య దీక్షలు ఎక్కువ చేసినవారు ఎవరున్నారో వారికి మిగిలిన వారు నమస్కరిస్తారు. ఎక్కువ దీక్షలు చేసినవారు, తక్కువ చాతుర్మాస్యాలు చేసిన వారికి నమస్కరించరు. అది సంప్రదాయం. కంచి కామకోటి మఠం వంటి పీఠాలలో కూడ ఇప్పటికీ ఒక నియమం ఉంది. ఒకసారి పిల్లవాడు మఠాధిపత్యం వహించాడనుకోండి. అప్పుడు సందర్శకుల వరుసలో వస్తున్న తండ్రిగారికి కూడా ప్రత్యేకత ఏమీ ఉండదు. కడుపునబుట్టిన కొడుకయినా సరే, తండ్రికూడా వచ్చి పీఠాధిపతుల పాదాలకు అందరిలాగే నమస్కారం చేసుకోవలసిందే. కానీ తల్లిగారు వరుసక్రమంలో వస్తున్నారనుకోండి. వెంటనే పీఠాధిపతయినా కూడా లేచి నిబడి అమ్మగారికే నమస్కారం చేయాలి. అది సంప్రదాయం, అది నియమం …అమ్మకు పాదాభివందనం…
అమ్మను మించి దైవమున్నదా
ఆత్మను మించి అద్దమున్నదా
జగమే పలికే శాశ్వత సత్యమిదే
అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే
అవతార పురుషుడైనా
ఓ అమ్మకు కొడుకే
అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే
అవతార పురుషుడైనా
ఓ అమ్మకు కొడుకే ॥
🌹భగవంతుడు మనందరి కోసం సృష్టించిన అత్యద్భుతమైన బహుమతి 🙏అమ్మ🙏…
అంతర్జాతీయ మాతృదినోత్సవ శుభాకాంక్షలు…💐
Dedicating to all Mother’s….