Breaking News

రెండు మాస్కులతో అధిక రక్షణ…

అమరావతి, నేటి పత్రిక ప్రజా వార్త :

ఒకవైపు కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తోంది. రోజూ వేల కేసులు నమోదవుతున్నాయి. మరణాలూ పెరుగుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ పడకలు లభ్యం కాని దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు టీకాల పంపిణీ మందకొడిగా సాగుతోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మనల్ని కాపాడే ఒకే ఒక అస్త్రం మాస్కు. అది కూడా ఒక్కటి కాదు.. ఏకకాలంలో రెండు మాస్కులు ధరిస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని అమెరికాకు చెందిన ‘సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌(సీడీసీ)’ స్పష్టం చేసింది. ఇందులోనూ లోపలి భాగంలో సర్జికల్‌ మాస్కును, పైభాగంలో క్లాత్‌ మాస్కును ధరిస్తే.. మెరుగైన ఫలితాలుంటాయని తేల్చిచెప్పింది. ఇక నుంచి రెండు మాస్కుల విధానాన్ని అనుసరించాలని సీడీసీ చెబుతోంది. వ్యాధుల నియంత్రణ, నివారణ, పరిశోధనల్లో ప్రపంచంలోనే అత్యంత ప్రాధాన్యం కలిగిన సంస్థ ఇది. ఇటీవలే కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కూడా రెండు మాస్కుల ప్రయోజనాలపై మార్గదర్శకాలను విడుదల చేసింది.

వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట…

* తొలుత వెలుగులోకి వచ్చిన వూహాన్‌ వైరస్‌ వ్యాప్తి రేటు 2.5 కాగా.. బ్రిటన్‌ రకం వైరస్‌  రేటు 4గా అధ్యయనాలు వెల్లడించాయి. అంటే ఒకరికి వైరస్‌ సోకితే వారి నుంచి నలుగురికి వ్యాధి వచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతం మన దేశంలో బ్రిటన్‌ రకం వైరస్‌ ఎక్కువ ఉధ్ధృతంగా వ్యాప్తి చెందుతోందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

* దగ్గడం, తుమ్మడం ద్వారానే కాకుండా.. మాట్లాడడం, గట్టిగా అరవడం, గొంతెత్తి పాడడం వంటి వాటి ద్వారా కూడా వైరస్‌ వ్యాప్తి చెందుతోందని లాన్సెట్‌ అధ్యయనం చెబుతోంది. 33-59 శాతం వైరస్‌ వ్యాప్తి ఇలాగే జరుగుతోందని పేర్కొంది.

* బహిరంగ ప్రదేశంలో కంటే.. తలుపులు మూసి ఉన్న పెద్ద గది, హాలులో ఈ వైరస్‌ ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. ఇటువంటి గదిలో కరోనా వైరస్‌ గాలిలో మూడు గంటల పాటు ఉండే అవకాశాలున్నాయి. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ఎంత మోతాదులో వైరస్‌ వెలువడుతుందో.. అందులో దాదాపు సగం తొలిగంటలో గాలి నుంచి నేలకు జారిపోతోంది. మిగిలిన సగం నేలపై పడడానికి మరో 2 గంటల సమయం పడుతుంది.

రెండు మాస్కులతో అధిక రక్షణ…

* మాట్లాడినప్పుడు, పాడినప్పుడు, దగ్గినప్పుడు వైరస్‌ 6 అడుగుల దూరం వరకూ వ్యాప్తి చెందుతుంది. అదే తుమ్మినప్పుడు 18 అడుగుల దూరం వరకూ కూడా వ్యాపిస్తుంది. అందుకే తలుపులు, కిటికీలు ఎప్పుడూ తెరిచి ఉంచాలి. గాలి వల్ల వైరస్‌ బయటకు వెళ్లిపోతుంది.

* ఒకే గది, హాలులో ఎక్కువ మంది గుమిగూడితే.. వైరస్‌ త్వరితగతిన ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. ఇటువంటప్పుడు సాధారణ మాస్కు ధరించినా కూడా వ్యాప్తికి అవకాశం ఉంటుందని మరో అధ్యయనం చెబుతోంది. ఈ పరిస్థితుల్లో రెండు మాస్కుల విధానాన్ని అనుసరించడం శ్రేయస్కరం. ఒక మాస్కు పెట్టుకుంటే వ్యాప్తి రేటు 60 శాతమే తగ్గుతుంది. రెండు మాస్కులు ధరించడం వల్ల కచ్చితంగా 80 శాతానికి పైగా నివారించగలిగే అవకాశాలుంటాయి.  ముఖ్యంగా లక్షణాలున్నవారు తప్పని సరిగా ధరించాలి.

*  ఎన్‌ 95 మాస్కు ధరిస్తే.. రెండు మాస్కులు ధరించాల్సిన అవసరం లేదు. దీనివల్ల దాదాపు 95% రక్షణ లభిస్తుంది.

సీడీసీ అధ్యయనం ఏం చెబుతోంది?

రెండు మాస్కులతో అధిక రక్షణ

* అందరికీ ఎన్‌ 95 ధరించడం సాధ్యం కాదు. పైగా ఖరీదైనది కాబట్టి కుదరని వాళ్లు రెండు మాస్కుల విధానాన్ని అనుసరించాలి.

* అలా అని ఒకేసారి రెండు సర్జికల్‌ మాస్కులు పెట్టుకోవద్దు. రెండు క్లాత్‌ మాస్కులు కూడా వాడవద్దు.

* ముందుగా సర్జికల్‌ మాస్కు ధరించిన తర్వాత.. దానిపైన క్లాత్‌ మాస్కును పెట్టుకోవాలి. అంటే లోపలి వైపు సర్జికల్‌ మాస్కు, వెలుపలి వైపు క్లాత్‌ మాస్కు ఉండాలి.

* ఈ విధానం వల్ల 85.4 శాతం వరకూ రక్షణ. గాలి పీల్చుకోవడంలో ఎటువంటి ఇబ్బందులుండవు.

రెండు మాస్కులు లేకపోతే..

* రెండు మాస్కులు అందుబాటులో లేనప్పుడు.. ఒక్క సర్జికల్‌ మాస్కును కూడా సాధారణంగా కాకుండా కొత్త విధానంలో ధరించాలి.

రెండు మాస్కులతో అధిక రక్షణ…

* సర్జికల్‌ మాస్కులో చెవులకు ధరించే వృత్తాకార దారాల మొదటి భాగాన్ని గట్టిగా ముడివేయాలి. ఆ ముడి వేసినప్పుడు ఎటువంటి గ్యాప్‌ లేకుండా చేసుకోవాలి. దీనివల్ల 77 శాతం రక్షణ ఉంటుంది.

* అలా రెండు వైపులా ముడివేసి ధరించడం ద్వారా ముక్కు, నోటిని పూర్తిగా కప్పివేసినట్లుగా ఉంటుంది. తద్వారా వైరస్‌ నుంచి రక్షణ లభిస్తుంది.

* ఎటువంటి ముడులు లేకుండా.. ఒక్క సర్జికల్‌ మాస్కును మాత్రమే సాధారణంగా వాడితే.. దాని వల్ల 56 శాతం రక్షణ లభిస్తుందని సీడీసీ చెబుతోంది.

మాస్కు వినియోగం?

రెండు మాస్కులతో అధిక రక్షణ…

* ముక్కు, నోరు పూర్తిగా కప్పి ఉంచేలా ధరించాలి.

* చెవులకు తగిలించడం, ముక్కు కిందకు జారవిడవడం సరికాదు.

* మాట్లాడేటప్పుడు కచ్చితంగా మాస్కు ధరించే ఉంచాలి.

* అస్తమానం మాస్కు ముందు భాగాన్ని చేత్తో తాకొద్దు.
అలా తాకి చేతులను శుభ్రపర్చుకోకుండా.. మళ్లీ అదే చేతిని కళ్ల వద్ద రుద్దుకోవడమో, ముక్కు వద్దకు చేర్చడమో చేసినప్పుడు వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదముంది.

రెండు మాస్కులతో అధిక రక్షణ…

మాస్కు ధరించడం వల్ల వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడంతో పాటు కొత్త వైరస్‌లు ఉత్పరివర్తనం చెందకుండా నివారించినట్లు అవుతుంది. వైరల్‌ లోడ్‌ను మాస్కులు అడ్డుకుంటాయి కాబట్టి.. ఒకవేళ స్వల్ప మోతాదులో లోనికి వెళ్లినా కూడా.. తక్కువ లోడ్‌ వెళ్తుంది. దీంతో వైరస్‌ ప్రభావ తీవ్రత కూడా తక్కువగానే ఉంటుంది. జబ్బు ఉన్నవారు పెట్టుకుంటే ఎదుటి వారికి వ్యాప్తి చెందదు. అలాగే వైరస్‌ సోకని వారు ధరిస్తే.. వ్యాధి ఉన్నవారి నుంచి వీరికి రాదు. ఎన్‌ 95 సహా ఏ మాస్కును ఎక్కువసార్లు ఉపయోగించకూడదు. క్లాత్‌ మాస్కు అయితే కొన్నిసార్లు ఉతికి తిరిగి ఉపయోగించుకోవచ్చు. మాస్క్‌ తడిస్తే వెంటనే తీసి కొత్తది వాడాలి.

వైరస్‌ తీవ్రతను తగ్గిస్తుంది…
-డాక్టర్‌ కిరణ్‌ మాదల, మత్తుమందు వైద్య విభాగం అధిపతి, క్రిటికల్‌ కేర్‌ అండ్‌ ఐసీయూ ఇన్‌ఛార్జ్‌, నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రి.

Check Also

గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కి, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కి కృతజ్ఞతలు

-ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్  అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *