‘అన్ని దానాలలో కెల్లా దానాల కన్నా అన్నదానం మిన్న’…


-శ్రీ ఆది శంకరాచార్య గోసేవ ట్రస్ట్, ప్రధాన కార్యదర్శి పుల్లేటికుర్తి మాధవరామ కామేశ్వరరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :

విజయవాడ నగరంలో కోవిడ్ 19 వైరస్ బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి సహాయం చేయడానికి  తోడుగా వచ్చి భోజనానికి ఇబ్బంది పడుతున్న వారికి నగరంలో ప్రభుత్వ ఆసుపత్రి తో పాటు పలు చోట్ల శ్రీ ఆది శంకరాచార్య గోసేవ ట్రస్ట్, ప్రధాన కార్యదర్శి పుల్లేటికుర్తి మాధవరామ కామేశ్వరరావు సారధ్యంలో భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీ ఆది శంకరాచార్య గోసేవ ట్రస్ట్, ప్రధాన కార్యదర్శి పుల్లేటికుర్తి మాధవరామ కామేశ్వరరావు మాట్లాడుతూ కోవిడ్ బాధితుల సహాయానికి తోడుగా వచ్చిన కొందరు ఇప్పటి పరిస్థితుల్లో సరైన భోజనం దొరక్క ఇబ్బంది పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ‘అన్ని దానాలలో కెల్లా దానాల కన్నా అన్నదానం మిన్న’ అనే ఉద్దేశంతో మా చేతనైనంతలో చేసిన సాయమే ఇది అని అన్నారు. భవిష్యత్తులో ఉచితంగా కోవిడ్ మందుల కిట్టు, కరోనా బాధితులకు భోజనం పంపిణీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. అవసరమైన వారు 6305665382 ఈ ఫోన్ నెంబర్కు సంప్రదించగలరు. ప్రతి వారు మాస్కు తప్పని సరిగా ధరించాలని, శానిటైజర్ వాడుతూ భౌతిక దూరం పాటించి తోటి వారికి ఇబ్బంది కలిగించకుండా వారు ఉండాలని, బయటకు అవసరమైతే తప్పితే ఇంటి వద్దే క్షేమంగా ఉండాలని కోరారు. ఇది మీకు మీ కుటుంబానికి ఎంతో మంచిదన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజక వర్గాల పునర్విభజన అధ్యయనానికి జనసేన కమిటీ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజకవర్గాల పునర్విభజన (డీ లిమిటేషన్) జరిగే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *