Breaking News

లక్ష మొక్కలు నాటే లక్ష్యంతో నగరంలో ప్రతి రోడ్డులో మొక్కలు నాటాలి మంత్రి పేర్ని

-ప్రతి ఇంటికి రక్షిత త్రాగునీరు అందించాలని ప్రభుత్వ ధ్యేయం
-అక్రమ వాటర్ ట్యాపులు రెగ్యులరైజేషన్ చేపట్టాలి
-ఎవరు తప్పు చేయమని చెప్పినా సౌమ్యంగా నో చెప్పండి, సచివాలయ సిబ్బందికి మంత్రి ఉద్బోధ
-సొంత ఇల్లు లేని వారందరికి ఇళ్ల స్థలాలు ఇప్పించే బాధ్యత తీసుకోవాలి
-కార్పొరేటరుగా మంచి పేరు సంపాదించాలని సూచన

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ఆదివారం జిల్లా పరిషత్ మీటింగ్ హలులో కార్పోరేటర్లు, మున్సిపల్ ప్లానింగ్ అధికారులు, సచివాలయ ఎడ్మిన్లు, ప్లానింగ్ సెక్రటరీలతో సమావేశం నిర్వహించి వివిధ పట్టణ సమస్యలపై సమీక్షించారు. నగరంలో అన్ని డివిజన్లలో ప్రతి రోడ్డులో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని లక్ష మొక్కలు నాటే లక్ష్యంతో నగరంలో డివిజన్ల వారీగా తారురోడ్లు, సిసిరోడ్లు, మెటల్ రోడ్లు ఎన్ని? వాటి పొడవు ఎంత ? లెక్కలు వేయాలని ప్రతి 3 మీటర్లకు ఓ మొక్క నాటే విధంగా చర్యలు తీసుకోవాలని, నాటిన ప్రతి మొక్కకు ట్రీగార్డ్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకోసం ఎసి, బెల్, బ్యాంకులు, వ్యాపార సంస్థల ద్వారా కార్పొరేట్ సామాజిక బాద్యత క్రింద ట్రీగార్డ్స్ ఏర్పాటు చేసే విధంగా వారితో మాట్లాడాలని కార్పొరేటర్లకు మంత్రి సూచించారు. డ్రైన్లు నిర్మించుటకు తగిన గ్యాప్ వదిలి మొక్కలు నాటాలని సూచించారు. రోడ్ల పై ఆవులు, గేదేల సంచారం ఎక్కువుగా ఉంటున్నదని, నివారణ చర్యలు చేపట్టాలని, పశువులను రోడ్ల పైకి వదలకుండా యజమానులకు కౌన్సిలింగ్ చేయాలని కార్పోరేటర్లకు మంత్రి సూచించారు. ప్రతి ఇంటికి రక్షిత త్రాగునీరు అందించాలని ప్రభుత్వ ధ్యేయమని మంత్రి పేర్కొన్నారు. నగరంలో గల 2 లక్షల జనాభాకు రోజుకు 1.57 కోట్ల లీటర్ల త్రాగు నీరు 17 ఓవర్ హెడ్ ట్యాంకుల ద్వారా సరఫరా చేస్తున్నట్లు, ఇందుకోసం ఏడాదికి 8 కోట్ల రూ.లు వ్యయం చేస్తున్నట్లు, రాబడి కేవలం 3.50 కోట్ల రూ.లు మాత్రమే అన్నారు. నగరంలో నిబంధనల అనుగుణంగా అనదికార వాటర్ ట్యాపులు రెగ్యులరైజేషన్ చేపట్టాలని అన్నారు. మంత్రి దృష్టికి వచ్చిన ఓ అక్రమ కట్టడంపై మంత్రి స్పందిస్తూ పట్టణంలో ఆక్రమ నిర్మాణాలపట్ల ఉదాసినంగా వ్యవహరించిన ప్లానింగ్ అధికారి సంబంధిత సచివాలయ ఎడ్మిన్ పై మంత్రి అగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనల మేరకు వెంటనే చర్యలు చేపట్టలని ఆదేశించారు.
ఇంటి నిర్మాణ ప్లాన్ ఆమోదం పొందకుండా ఇంటి నిర్మాణం చేపట్టకుండా చూడాలని నీజాయితీగా వ్యవహరించాలని ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని పేదలకు ప్రభుత్వ సేవలు అందించడంలో ముందంజలో ఉండాలని మంత్రి సచివాలయ సిబ్బందికి సూచించారు. నగరానికి కమీషనర్ ఎలాగో సచివాలయానికి ఎడ్మిన్లు అలాగే నని, సచివాలయానికి మీరే బాధ్యులని క్రింద సిబ్బంది పై పర్యవేక్షణ కలిగి ఉండాలని అలా కాకపోతే చేతకానివారవుతారని మంత్రి హితవు పలికారు. కార్పొరేషన్ అధికారులు గాని ప్రజాప్రతినిదులుగాని ఎవరు తప్పు చేయమని చెప్పినా సౌమ్యంగా “నో” చెప్పడం అలవర్చుకోవాలని, నిజాయితీగా వ్యవహరించండని ఉద్బోదించారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లకు సంబంధించి కొత్త వారికి జీతాలు రావడం లేదని వారికి వెంటనే సిఎస్ఎంఎస్ ఐడిలు క్రియేట్ చేసి జీతాలు సకాలంలో అందేలా చూడాలని , కొంత మంది వాలంటీర్లకు సేవామిత్ర పధకంలో పని తీరు పోత్సహక బహుమతి 10 వేల రూ.లు అంద లేదని, సమస్య పరిష్కరించాలని మంత్రి కమీషనర్ ను ఆదేశించారు. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పధకం క్రింద బ్యాంక్ ఎక్కౌంట్లు గల గృహనిర్మాణ లబ్దిదారులకు వారి ఖాతాల్లో ఏడాదికి 50 వేల రూ.ల మించి క్రెడిట్ చేయకూడదని నిబంధన కారణంగా గృహనిర్మాణానికి ప్రభుత్వం ఇస్తున్న 1.80 లక్షల రూ.లు లబ్దిదారులకు అందించడానికి ఏర్పడిన సమస్య ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లతామన్నారు. గృహనిర్మాణానికి ప్రభుత్వ సాయం సరిపోకపోతే డ్వా క్రా సంఘాల లో గల లబ్దిదారులకు 50 వేల రూ.లు రుణం ఇప్పించుటకు చర్యలు తీసుకోవాలని అన్నారు. శానిటరీ వర్కర్ల ఖాళీలు భర్తీ చేయుటకు చర్యలు తీసుకోవాలని మంత్రి కమీషనర్ ను ఆదేశించారు. గిలకలదిండి, బందరుకోట, శారదానగర్ ప్రాంతాలలో సెల్ ఫోన్స్ సిగ్నిల్స్ సరిగలేక సచివాలయ సిబ్బంది సిమ్లు పనిచేయడం లేదని నా దృష్టికి వచ్చిందని, వేరే నెట్ వర్క్ సిమ్ లు ఇప్పించుట ద్వారా సమస్య పరిష్కరించాలని అన్నారు. దేవాలయాలకు కమిటీలు వేయాలని నిర్ణయించామని , కావున నగరంలో ఆయా డివిజన్ల లో గల దేవాలయాల జాబితాలు వెంటనే ఇవ్వాలని కార్పొరేటర్లకు సూచించారు. మీ డివిజన్ల లో సొంత ఇల్లు లేని వారందరికి వారి అర్హత మేర ఇళ్ల స్థలాలు ఇప్పించే బాధ్యత తీసుకోవాలని కార్పొరేటర్లను మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో డిప్యూటి మేయర్లు టి. కవిత, సీనియర్ కార్పొరేటర్ లంక సూరిబాబు, మార్కెట్ యార్డు చైర్మన్ అచ్చాబా, నగర కమీషనర్ సబ్బి శివరామకృష్ణ, మాజీ మున్సిపల్ ఛైర్మన్ సిలార్ దాదా, మాజీ అర్బన్ బ్యాంకు అధ్యక్షులు బొర్రా విఠల్ , కార్పొరేటర్లు, సచివాలయ ఎడ్మిన్లు, ప్లానింగ్ కార్యదర్శిలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

మనమంతా ఒక టీం..కలిసి పనిచేద్దాం… ప్రజల జీవితాలు మారుద్దాం!

-పేదల జీవన ప్రమాణాలు పెంచేలా సంస్కరణల అమలు -మార్పు తేవాలనే సంకల్పానికి నూతనత్వం, సాంకేతికత జోడిస్తే శాఖల్లో అద్బుత ఫలితాలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *