-కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజల్లోకి దేవినేని ఉమా, ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త:
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మున్సిపాలిటీలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా సాగిన ఎన్నికల ప్రచారంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి శ్రీ దేవినేని ఉమా మహేశ్వరరావు, కొవ్వూరు ఎమ్మెల్యే శ్రీ ముప్పిడి వెంకటేశ్వరరావు కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి పాల్గొని ప్రజలను కలుసుకున్నారు.
ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సూపర్ సిక్స్ హామీల అమలు, ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు, మహిళలకు ఆర్థిక భరోసా కల్పించే కార్యక్రమాలు, దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, అన్నదాతలకు అన్నదాత సుఖీభవ వంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ద్వారా అందుతున్న ప్రయోజనాలను వివరించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని నాయకులు పేర్కొన్నారు. పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పన, రహదారుల అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించడం వంటి అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని వివరించారు. కొవ్వూరు మున్సిపాలిటీ అభివృద్ధికి స్థానిక సమస్యల పరిష్కారం, ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధమైన చర్యలు కీలకమని తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, స్థానిక అవసరాలను గుర్తిస్తూ కూటమి నాయకులు వార్డుల్లో ప్రచారాన్ని కొనసాగించారు.
