Breaking News

మానవులను సాధనాలుగా మలచుకొని తన లక్ష్యాన్ని పూర్తి చేసేవారే భగవంతుడు : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
అల్లా ఆజ్ఞ ప్రకారం ఎన్నో ఆశ్చర్యకరమైన పనులు జరుగుతూనే ఉంటాయని మానవులను తన సాధనాలుగా మలచుకొని అనుకొన్న లక్ష్యాన్ని పూర్తి చేసుకొంటారని అందుకు ప్రత్యక్ష ఉదాహరణ బీ బీ ఫాతిమా జహ్రా ఆస్తానా పంజా నిలుస్తుందని రాష్ట్ర, రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు.
శుక్రవారం  ఆయన స్థానిక 26 వ డివిజన్ ( జవ్వారుపేట ) లోని 400 ఏళ్ళ నాటి పురాతన బీబీ ఫాతిమా జహ్రా ( ఖాతునే క్యామత్ ) ఆస్తానా పంజా సమీపంలోని కమ్యూనిటీ సెంటర్ శంఖుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇస్లాం పరిపూర్ణమైన రోజు నేడని అందరికి ఈద్ గధీర్ శుభాకాంక్షలు ముందుగా తెలియచేసారు. ఇస్లామీయ ప్రవక్త ముహమ్మద్ కుమార్తె ఫాతిమా జహ్రా ప్రపంచంలోని స్త్రీలందరికీ ఒక ఆదర్శమూర్తి గా నిలిచిపోయారని ఆమె తన తండ్రియైన మహమ్మద్ ప్రవక్త ఆపత్కాలంలో నుండగా ఆయన చెంతనే అనేక కష్టాలు సహిస్తూ తోడుగానే ఉన్నారని మంత్రి కొనియాడారు. అంతటి మహనీయురాలి పేరిట బీ బీ ఫాతీమా జహ్రా ఆస్థాన పంజా పక్కనే నిర్మితమవుతున్న కమ్యూనిటీ సెంటర్ వేగవంతంగా పనులు జరిగేలా, షియా సోదరులంతా ఐక్యంగా ఈ మహత్తర కార్యక్రంలో పాల్గొనేల చేసిన మహిమ ఇక్కడ ప్రస్ఫుటంగా కనబడుతుందని మంత్రి పేర్ని నాని అన్నారు. బీ బీ ఫాతిమా జహ్రా ఆస్తానా పంజా సమీపంలోనే 400 స్థలం విక్రయానికి రావడం, చిన్నా పెద్దా ధనిక పేద బేధం లేకుండా షియాలు అందరూ ఏకతాటిపై నిలిచి ఆ స్థలం కొనేందుకు 60 లక్షల రూపాయలు సేకరించి కమ్యూనిటీ సెంటర్ ఏర్పాటుకు కృషి చేయడం వెనుక దైవశక్తి ఉందని మంత్రి అన్నారు. తనను ఆహ్వానించి ఒక మంచి కార్యం నెరేవేరే క్రమంలో తనను భాగస్వామిని చేయడం పట్ల మంత్రి పేర్ని నాని కృతజ్ఞతలు స్థానిక పెద్దలకు తెలిపారు. కమ్యూనిటీ సెంటర్ నిర్మాణానికి తన వంతు సహాయం తప్పక చేస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రషాద్ మౌలానా , అలీ అబ్బాస్, మీరాఖ్ అబ్బాస్, 26 వ డివిజన్ ఇంఛార్జ్ మాడపాటి వెంకటేశ్వరరావు, మచిలీపట్నం మాజీ మునిసిపల్ చైర్మన్ షేక్ సలార్ దాదా, మచిలీపట్నం మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ షేక్ ముస్తఫా ( అచ్చాబా ), కార్పొరేటర్లు మీర్ అస్గర్ అలీ, పరింకాయల విజయచందర్, షేక్ సాహెబ్, మీర్ నజీఫ్ అలీ, మోసిన్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ను సచివాలయంలో కలిసిన పలువురు ఎన్ ఆర్ ఐ లు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వివిధ దేశాల్లో ఉన్న ఎన్ ఆర్ ఐ లను ప్రవాసాంధ్ర తెలుగు సంఘం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *