విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గుణదల వైస్సార్సీపీ కార్యాలయం నందు శుక్రవారం నిరుపేద కుటుంబనికి చెందిన పింజల పద్మావతి కి జీవనోపాధి నిమిత్తం వైయన్ఆర్ చారిటీస్ ద్వారా యలమంచిలి జయప్రకాష్ తోపుడు బండిని తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ చేతుల మీదుగా ఆమెకు అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ యలమంచిలి జయ సామాజిక సేవ కార్యక్రమలు ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పించారని,ఇంత మంచి కార్యక్రమంలో తనని భాగస్వామిని చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. భవిష్యత్తు లో ఇలాగే సేవ కార్యక్రమంలు కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నిడమానూరు మాజీ సర్పంచ్ పరిమి రమేష్, పరిమి వంశీ, వైసీపీ నాయకులు గల్లా రవి తదితరులు పాల్గొనడం జరిగింది.
Tags vijayawada
Check Also
ఆంధ్రప్రదేశ్‌లో పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకం ప్రవేశపెట్టడం కోసం AP ఛాంబర్స్ న్యాయవాదులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ …