అనంతపల్లి, నేటి పత్రిక ప్రజావార్త:
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తోందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల మండలం అనంతపల్లిలో నిర్వహించిన ‘చెప్పాం.. చేస్తున్నాం’ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుతో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుంటూ ప్రభుత్వ పథకాలను వివరించారు. మహిళల సంక్షేమం, రైతుల అభ్యున్నతి, యువతకు ఉపాధి, పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. విద్య, వైద్యం, గ్రామీణ రహదారులు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని నాయకులు వివరించారు.
