Breaking News

ఖాళీలను భర్తీ చేయండి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి…

-జోనల్ డిటీసీతో రవాణాశాఖ ఉద్యోగ సంఘ నేత యం.రాజుబాబు

కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జోన్2 పరిధిలో ఖాళీలైన సీనియర్ అసిస్టెంట్ల స్థానాలలో అర్హులైన జూనియర్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించాలని, ఇటీవల మృతి చెందిన ఉద్యోగుల కుటింబికుల కుటుంబాలకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగ అవకాశాలు కల్పించి వారి సమస్యలను పరిష్కరించాలని రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోన్2 అధ్యక్షుడు యం.రాజుబాబు డిటిసి ఎ మోహన్ దృష్టికి తీసుకెళ్లారు. తూర్పుగోదావరి జిల్లా డిటీసీగా నియమితులైన ఎ మోహన్ ని రవాణాశాఖ ఉద్యోగ సంఘ నేతలు శుక్రవారం వారి కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలసి ఆయనకు పుష్ప గుచ్చమ్ ఇచ్చి శాలువాతో అభినందనలు తెలియజేశారు. జోన్2 అధ్యక్షుడు యం రాజుబాబు మాట్లాడుతూ ఉద్యోగులకు నానాటికీ పనిభారం పెరుగుతుందని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖాళీగా ఉన్న పోస్టులకు తొరలోనే భర్తీ చేయాలని, ఉద్యోగ బాధ్యతలు చేస్తూనే ఇటీవల మృతిచెందిన ఉద్యోగి కుటింబికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి వారిని ఆదుకోవాలని డిటీసీని కోరడం జరిగిందన్నారు. ఉద్యోగుల సమస్యలపై స్పందిస్తూ వారి సమస్యలను పరిష్కరించడంలో చొరవ చూపుతున్న డిటీసీ మోహన్ ను కాకినాడలో జోనల్ డీటీసీగా నియమించడంపట్ల ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఉద్యోగ సంఘ నేతలు విజ్ఞప్తి మేరకు డిటీసీ ఎ మోహన్ స్పందిస్తూ ఖాళీయేనా పోస్టులలో త్వరలోనే పదోన్నతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. తన పరిధిలో లేని వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి చర్యలు తీసుకునేలా చేస్తామని ఉద్యోగ సంఘాల నేతలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రవాణాశాఖ కానిస్టేబుల్ స్ సంఘం అధ్యక్షుడు కె భద్రాచలం (రాజా) ఉద్యోగ సంఘ నాయకులు రామ్మూర్తి, పిఎస్ఎన్ రాజు, సత్తిబాబు, జివివికెజె రాజు, నాగశంకర్ మరియు ఉద్యోగులు ఉన్నారు.

Check Also

ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *