విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం స్వాతంత్ర్య స్ఫూర్తిని, ఆనాటి జాతీయ నాయకుల త్యాగాలను గుర్తుకు తెస్తోందని కమాండెంట్ జాహీద్ ఖాన్ చెప్పారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాల్లో భాగంగా ఎస్ఎఆర్ఎఫ్ బెటాలియన్ శుక్రవారం గన్నవరం మండలంలోని కొండపావులురు గ్రామంలో కొత్తగా కేటాయించిన నూతన ప్రాంగణంలో నిర్వహించిన 10 కిలో మీటర్ల రన్ విజయవంతమైయింది. ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ జాహీద్ ఖాన్ అధ్వర్యంలో ఎస్ఎఆర్ఎఫ్ ఆఫీసర్లు జవాన్లు, వారి కుటుంబ సభ్యులతో కలసి 300 మొక్కలు నాటారు. పిల్లలు పెద్దలు కలసి ఉత్సాహంగా, వేడుకగా మొక్కలు నాటారు. లింగా యాస్ ఇన్సిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ అండ్ టెక్నాలజీ నుంచి వచ్చిన 75 మంది విద్యార్థులు, అధ్యాపకులు ఈ చైతన్య కార్యక్రమంలో పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …