-జిల్లాలో నేటి నుండి చేనేత కార్మికులకు 200 యూనిట్లు, పవర్ లూం కార్మికులకు 500 యూనిట్ల విద్యుత్ ఉచితం.
-ఘనంగా నిర్వహించిన 11 వ జాతీయ చేనేత దినోత్సవ ర్యాలీ వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ : డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్
వెంకటగిరి, నేటి పత్రిక ప్రజావార్త :
నేడు 11వ జాతీయ చేనేత దినోత్సవం లో భాగంగా వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, చేనేత కార్మికులు కలసి వెంకటగిరి క్రాస్ రోడ్డు కూడలి నుంచి త్రీ భువన్ సర్కిల్ వరకు నిర్వహించిన ర్యాలీలో ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ పాల్గొన్నారు.
గురవారం ఉదయం స్థానిక వెంకటగిరిలో 11 వ జాతీయ చేనేత దినోత్సవo లో భాగంగా నిర్వహించిన ర్యాలీ అనంతరం పద్మశాలి కళ్యాణమండపం నందు ఘనంగా ఏర్పాటు చేసిన 11 వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ స్థానిక వెంకటగిరి నియోజకవర్గ ఎం.ఎల్.ఏ కురుగొండ్ల రామకృష్ణతో కలిసి ముఖ్య అతిధిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంబించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ మనందరికీ జాతీయ చేనేత దోనోత్సవాన్ని ఆగస్టు 7, 2015వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం గుర్తించడం జరిగిందని తెలిపారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం చేనేత దినోత్సవం ప్రతి సంవత్సరం చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతోందని తెలిపారు. గతసంవత్సరంలో కూడా ఇదే వేదిక మీద చేనేత దినోత్సవాన్ని నిర్వహించుకున్నామని, అప్పుడు కూడా చాలా సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగిందని, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రోత్బలంతో గడిచిన సంవత్సరం చాలా వరకు సమస్యలను మనం పరిష్కరించడం జరిగిందని, అవి కాకుండా నేతన్నలకు ఉన్న చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కారం చేసే విధంగా ప్రభుత్వ యంత్రాంగం పని చేస్తోందని తెలిపారు. ఈ రోజు మనం జరుపుకుంటున్న ఈ వేడుకకు ఒక చరిత్ర ఉందని 1905, ఆగస్టు 7 న ప్రారంభం అయినటువంటి స్వదేశి ఉద్యమంలో స్వదేశీ పరిశ్రమలను ముఖ్యంగా చేనేత కార్మికులను ప్రోత్సహించడం జరిగిందన్నారు. స్వదేశీ ఉద్యమం జరిగి ఈ రోజుకు సుమారు 120 సంవత్సరాలు అయిందన్నారు. దానిని స్మరించుకొని ఆగస్టు 7 న జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. తిరుపతి జిల్లాలో సుమారు 6 వేలు పైన చేనేత కుటుంబాలు ఉన్నాయని, ముఖ్యంగా వెంకటగిరి, శ్రీకాళహస్తి,గూడూరు, నారాయణవనం లో ఉన్నారన్నారు. వెంకటగిరి పట్టు, కాటన్ చీరలు, జన్దారీ చీరలు ప్రసిద్ది గాంచాయన్నారు. నారాయణవనం పెళ్లి పట్టు చీరలు, పుత్తూరు టవల్స్, దోతీలు ఇక్కడ బాగా ప్రసిద్ది చెందినవి, జిల్లాలో దాదాపు 29 ప్రాధమిక చేనేత సహకార సంఘాలు పని చేస్తున్నాయని, వెంకటగిరిలో 7 సంఘాలు యాక్టివ్ గా పని చేస్తున్నాయని, 2024-25 సంవత్సరానికి గాను పి.ఎం ముద్ర యోజన పథకం క్రింద 148 మంది చేనేత కార్మికులకు రుణాలు ఇవ్వడం జరిగిందని, సుమారు 42 మంది చేనేత కార్ముకులకు 41లక్షలతో రుణాలు మంజూరు చేశామన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా గౌ.రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్.టి.ఆర్. పెన్షన్ భరోసా కార్యక్రమాన్ని ప్రారంబించడం జరిగిందని, ప్రతి నెలా 1 వ తారీకున మనం ఇంటింటికి వెళ్లి సచివాలయ సిబ్బంది తో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో గౌ. ముఖ్యమంత్రి తో పాటు ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారని, అందులో భాగంగా మన జిల్లాలో సుమారు 5712 చేనేత కార్మికులకు నెలకు 4 వేలు చొప్పున ఎన్టిఆర్ భరోసా పెన్షన్ అందిస్తున్నామన్నారు. వెంకటగిరి నందు కోటి యాభై రెండు లక్షలతో 182 చేనేత కార్మికులతో పోలేరమ్మ చేనేత క్లస్టర్, శ్రీకాళహస్తి నందు 191 మందితో 90 లక్షలతో శ్రీకాళహస్తీస్వర స్మాల్ క్లస్టర్, నారాయణవనంలో 171 మంది కార్మికులతో కోటి రూపాయలతో నారాయణవనం స్మాల్ క్లస్టర్ మంజూరు కాబడిందని తెలిపారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఎక్ష్జిబిశన్ ఎక్స్పోలలో వెంకటగిరిలో నైపుణ్యం గల చేనేత కార్మికులు నేచిన వెంకటగిరి పట్టు, కాటన్ చీరలు, జన్దారీ చీరలను టాటా,తనేరా, ఆదిత్య బిర్ల, గౌరంశ వంటి ప్రసిద్ది సంస్థలు కొనుగోలు చేస్తున్నాయన్నారు. గడిచిన రెండువారాలు క్రితం శ్రీ లంకా శ్రీనివాసులు వారికి ప్రతిష్టాత్మకమైన సంత్ కబీర్ అవార్డు రావడం గర్వించదగ్గ విషయం అన్నారు. ఇలాంటి అవార్డు మన జిల్లాకు రావడం చాలా గర్వకారణమని అందుకు కారణమైన వెంకటగిరికి చెందిన చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించాలని వీరికి సభా ముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని అన్నారు. చేనేత రంగంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు సంత కబీర్ అవార్డును ఈ రోజున శ్రీనివాసులు గారు ప్రధాన మంత్రి గారి చేతుల మీదుగా తీసుకోవడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా మరో గొప్ప విషయం ఏంటంటే జరిగిన వారం రోజుల్లోనే మన కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఒక జిల్లా ఒక ప్రోడక్ట్ అవార్డులో దేశంలోనే వెంకటగిరి చీరలకు గోల్డెన్ అవార్డు రావడం జరిగిందని ఆ అవార్డును కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోషల్ చేతుల మీదుగా నేను అందుకోవడం జరిగిందని అన్నారు. గౌ. ముఖ్యమంత్రివర్యులు తిరుపతి జిల్లాలో నేటి నుండి చేనేత కార్మికులకు 200 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా అందిస్తున్నారని అలాగే పవర్ లూం కార్మికులకు 500 యూనిట్లను అందివ్వనున్నారని అన్నారు. ప్రభుత్వంపై ఎంతో ఆర్థిక భారం ఉన్నప్పటికీ చేనేతల మేలుకోరే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వారికి ఉచితంగా కరెంటును అందిస్తున్నదని దీనికి చేనేతలు ప్రభుత్వం పట్ల కృతజ్ఞత చూపాలని అన్నారు. చేనేత కార్మికులకు మరింత ప్రోత్సాహకాన్ని అందించేలా ముద్ర లోన్లు అందివ్వాలని ఎల్డిఎంని ఆదేశించారు. చేనేతలకు ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని, మీ సమస్యలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యే విధంగా చూస్తామని తెలిపారు.
వెంకటగిరి ఎం.ఎల్.ఏ మాట్లాడుతూ.. దేశంలోనే వెంకటగిరి చీరలకు అత్యంత డిమాండ్ ఉన్నందునగౌ. ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ రైతుల తర్వాత చేనేత కార్మికులకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ వారికి మరిన్ని ప్రోత్సాహకాలను అందిస్తూ వారిని అభివృద్ధి చేయాలని ఆకాంక్షిస్తున్నారని అన్నారు. జిల్లాలోని ప్రజలు వెంకటగిరి చేనేత కార్మికులు వేసిన డిజైన్లను విరివిగా ఆదరించాలని కోరారు. వారికి మరింత ప్రోత్సాహకాలను అందించి వారి అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు.
కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే తో కలిసి చేనేతలకు రూ. 60 లక్షల ముద్ర వీవర్స్ చెక్కును అందజేశారు.
ఈ కార్యక్రమంలో హ్యాండ్లూమ్ ఏడి రమేష్, ఎల్ డి ఎం గుంటూర్ రవికుమార్, అధికారులు, ప్రజా ప్రతినిధులు,చేనేత సంఘ నాయకులు గంగాధర్, విశ్వనాధన్, లక్ష్మీపతి, సత్యనారాయణ, రాజేశ్వర్ రావు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News