Breaking News

ప్రతి ఒక్కరూ బాధ్యత గా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి : జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్

-తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయాలి
-దామినేడులో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువాన్షి తో కలిసి పాల్గొన్న జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. శనివారం స్థానిక తిరుపతి రూరల్, తిరుచానూరు పంచాయతీ దామినేడు లో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువాన్షి తో కలిసి పాల్గొన్న జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్..

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రతి నెల ప్రతి మూడవ శనివారం స్వచ్ఛంధ్ర కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్లాస్టిక్ నిర్మూలన, డ్రైనేజీ క్లీనింగ్ వంటి ప్రత్యేక థీమ్ లతో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని, వారి పిలుపు మేరకు ఈరోజు దామినేడు లో స్వచ్ఛంద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి నెల మూడవ శనివారం ప్రత్యేకమైనటువంటి దీంతో జిల్లా వ్యాప్తంగా అనేక స్వచ్ఛంద కార్యక్రమాలను అన్ని పంచాయతీలు, వార్డులలో కూడా నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు.ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో చెత్త అన్నది పెద్ద సమస్యగా మారిపోయిందని, ప్రజలు అవగాహన కలిగి తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటిలోని కిచెన్ రూమ్ లోనే చెత్త, ఎలక్ట్రానిక్ వేస్టేజ్ ను వేరుగా చేర్చి మున్సిపాలిటీ వాళ్ళకి అందజేయాలని తెలిపారు. మీ పరిసరాల్లోని చెత్తనంతా ఒకే చోట వేయడం వలన పెద్ద మొత్తంలో చెత్త పేరుకుపోయి చుట్టుపక్కల ప్రజలకు అనేక అనారోగ్య సమస్యలు తలెత్తడం జరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరు కూడా తమ ఇల్లే కాకుండా తమ పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలనే అవగాహన రావాలని అన్నారు. ప్లాస్టిక్ కవర్ లు, బాటిళ్లు వంటి వేస్టేజ్ వలన డ్రైనేజ్ మూసుకుపోవడం నీరు పోలేని పరిస్థితి అవుతుందని దోమలు కూడా విపరీతంగా పెరిగిపోతాయని అన్నారు. ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా చెత్తను వేరు చేసుకుని చుట్టుపక్కల కూడా చెత్త నిల్వ ఉండకుండా చూసుకోవాలని అప్పుడే ఊరు కూడా బాగుంటుందని అన్నారు.

జిల్లా పంచాయతీ అధికారిని మాట్లాడుతూ.. ప్రతి మూడవ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని జిల్లాల్లో నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రతినెల ప్రత్యేకమైన థీమ్ తో అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతము వర్షాకాలం కావడం వలన ప్రజలు వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరు త్రాగునీరు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి రోజు పంచాయతీ ప్రజలకు క్లోరినేషన్ కల్పిన నీరుని సరఫరా చేస్తున్నామని తెలిపారు. పైప్ లైన్ లీకేజీ, మురికి నీరు మంచినీళ్లు కలవడం వంటి సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొని రావాలని తెలిపారు. తమ ఇంటి దగ్గరే ఉండే నీటి తొట్టెలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. వర్షాకాలం కావడం వలన ప్రతి ఒక్కరు కూడా వ్యాధుల బారిన పడకుండా తమ ఆరోగ్యాన్నీ కాపాడుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముందు దామినేడు గ్రామంలోనీ మురుగు నీటి కాలువలను, నీటి తొట్టెలను జిల్లా కలెక్టర్ పరిశీలించి ఎప్పటికప్పుడు నీటి తొట్టెలను, కాలువలను పరిశుభ్రంగా ఉంచుకొని దోమలు వ్యాప్తి చెందకుండా చూసుకోవాలని తెలిపారు. అనంతరo పంచాయతీ వారు ఏర్పాటు చేసిన చెత్త తీసుకొని సరుకులు ఇచ్చే స్వచ్ఛ రథం ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ దామనేడు లోని ప్రజలు వారు కలెక్ట్ చేసిన చెత్తను స్వచ్ఛ రథంకు ఇవ్వడం జరిగింది ఆ చెత్తను కేజీ ప్రకారం తీసుకొని వారికి కావాల్సిన నిత్యాసర సరుకులను జిల్లా కలెక్టర్ స్వయంగా పంపిణీ చేయడం జరిగింది. అనంతరం జిల్లా కలెక్టర్ వర్మీ కంపోస్ట్ ఎరువును గ్రామ ప్రజలకు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రామచంద్ర, జిల్లా పర్యాటక శాఖ అధికారి జనార్దన్ రెడ్డి, పంచాయతీ సెక్రటరీ మనీ, ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు..

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 13వ తేదీన మంగళగిరి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *