Breaking News

సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్… : మంత్రి కందుల దుర్గేష్

-తీరుగూడెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్
-ఇంటింటికి వెళ్లి స్వయంగా లబ్ధిదారులకు పెన్షన్ అందజేసిన మంత్రి కందుల దుర్గేష్
-మంత్రి కందుల దుర్గేష్ ఆప్యాయ పలకరింపుకు ఫిదా అయిన లబ్ధిదారులు
-ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పెంపు విప్లవాత్మక మార్పు అని తెలిపిన మంత్రి కందుల దుర్గేష్
-నిడదవోలు నియోజకవర్గం లో 35 వేల మందికి రూ. 15.31 కోట్ల విలువైన పెన్షన్లను అందిస్తున్నామని వెల్లడి.. -నిడదవోలు పట్టణంలో 4214 కి రూ. 1.89 కోట్ల విలువైన పెన్షన్ లు అందిస్తున్నామని పేర్కొన్న మంత్రి కందుల దుర్గేష్
-గత ప్రభుత్వం బటన్లు నొక్కడం మీద పెట్టిన శ్రద్ధ ప్రజల బాగోగుల మీద పెట్టలేదని విమర్శించిన మంత్రి దుర్గేష్

నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అయిందని మంత్రి కందల దుర్గేష్ అన్నారు. బుధవారం నిడదవోలు పట్టణంలోని తీరుగూడెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో స్వయంగా పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ నిడదవోలు నియోజకవర్గం లో 35 వేల మందికి రూ. 15.31 కోట్ల విలువైన పెన్షన్లను అందిస్తున్నామని వెల్లడిం చారు. నిడదవోలు పట్టణం వ్యాప్తంగా 4224 మందికి రూ. 1 కోటి 89 లక్షల 19 వేల 500 ల విలువైన పెన్షన్లను ప్రతి నెలా ఇవ్వడం జరుగుతుందన్నారు. పీఎం నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను సూపర్ హిట్ చేసిందన్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్థికపరమైన ఇబ్బందులు ఎన్ని ఉన్నా కూడా, గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి వెళ్లినప్పటికీ కూడా ప్రజలకు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ లో భాగంగా సామాజిక పెన్షన్లను పెంచామని మంత్రి కందుల దుర్గేష్ గుర్తు చేశారు. వృద్ధులు, వితంతువులు,ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, డప్పు కళాకారులు, హిజ్రాలు, హెచ్‌ఐవీ బాధితులు, కళాకారులకిచ్చే రూ. 3,000 పెన్షన్ ను రూ. 4,000 చేసామన్నారు. దివ్యాంగులకు రూ. 6000,కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేయించుకున్న వారికి, డయాలసిస్‌ స్టేజ్‌కు ముందున్న కిడ్నీ రోగులకు రూ. 10,000, పూర్తిస్థాయిలో అస్వస్థతకు గురైన వారికి, అనారోగ్యంతో మంచానపడి లేవలేని స్థితిలో ఉన్నవారికి, వీల్‌చైర్‌లో ఉన్న వారికి, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఇప్పటి వరకు అందిస్తున్న రూ. 5 వేల పెన్షన్ ను ఒకేసారి రూ. 15000 కి పెంచి ప్రతినెల 1వ తేదీనే గుమ్మం వద్దకు వెళ్లి ఇస్తున్నామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్, మే, జూన్ నెల పెన్షన్ బకాయిలు కలిపి జూలైలో రూ. 7,000 పెన్షన్ అందించామన్నారు.

స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామన్నారు.

అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ యోజన కింద రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా 20వేల రూపాయలు అందిస్తున్నామన్నారు. తొలి దశలో రైతన్నల ఖాతాలో 7 వేల రూపాయలు జమ చేశామని గుర్తు చేశారు.

మెగా డీఎస్సీ ద్వారా 16 వేల పైచిలుకు ఉద్యోగాలు కల్పించామన్నారు. రికార్డ్ సమయంలో పరీక్షలు నిర్వహించి ఇటీవలే ఎంపికైన అభ్యర్థులకు అమరావతిలో అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా అందజేశామన్నారు.

దీపం 2 పథకం ద్వారా ఏటా మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నామని వెల్లడించారు.

గత ప్రభుత్వం బటన్లు నొక్కడం మీద పెట్టిన శ్రద్ధ ప్రజల బాగోగులపై పెట్టలేదని మంత్రి దుర్గేష్ విమర్శించారు. రూ. 2000 పెన్షన్ ను రూ. 3000 చేసేందుకు ఐదేళ్ల కాలం పట్టిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం రూ. 3000 పెన్షన్ ను రూ. 4000 చేసిందన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పెంపు పేదలకు ఆర్థికంగా ధీమానిస్తుందని ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పోస్టర్ ఫ్రీ సిటికి ప్రతి ఒక్కరి సహకారం, భాగస్వామ్యం అవసరం

-లక్షల ఖర్చుతో చేస్తున్ననగర సుందరీకరణకు పోస్టర్స్ తో చేటు -పోస్టర్స్ తొలగింపుకు ప్రత్యేక కార్యాచరణ -నిబందనలు ఉల్లంఘించిన వారిపై భారీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *