కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
డివిజన్ స్థాయి, మండల స్థాయి అధికారులు ప్రజల సమస్యలు త్వరిత గతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఆసరా, కొవ్వూరు ఇంచార్జ్ ఆర్డీఓ, పి. పద్మావతి అన్నారు. కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం స్పందన దరఖాస్తులు ప్రజలనుండి స్వీకరించారు. ఈ సందర్బంగా పద్మావతి మాట్లాడు తూ మొత్తం 15 స్పందన దరఖాస్తు లు వచ్చాయని అన్నారు. వీటిలో స్థల వివాదాలు పరిష్కారం, ఇంటి స్థలం కోసం దరఖాస్తు లు, స్వచ్ఛ భారత్ మరుగుదొడ్లు నిర్మాణం బిల్లు లు, ఎన్ ఆర్ ఈ జి ఎస్ చెల్లింపు లు, తదితర అంశాలపై ఫిర్యాదులు సమర్పించి త్వరితగతిన పరిష్కరించా లని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కార్యాల య ఏ. ఓ,జి. ఎస్. ఎస్.జవ హర్ బాజీ, డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.
Tags kovvuru
Check Also
తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం
-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …