-విధుల నిర్వహణలో వివిధ శాఖల మధ్య చక్కటి సమన్వయం
-జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ, నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఎన్టీఆర్ జిల్లాలో పట్టణ స్థానిక సంస్థల సాధారణ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను ప్రశాంతంగా, స్వేచ్ఛగా, విజయవంతంగా నిర్వహించేందుకు అంకితభావంతో విధులు నిర్వర్తించిన అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, వాలంటీర్లకు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ, నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు సంయుక్తంగా ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పోలింగ్ నిర్వహణలో పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ తదితర శాఖల అధికారులు, సిబ్బంది సమష్టి కృషి, పరస్పర సమన్వయంతో పనిచేయడం వల్ల ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా కొనసాగిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ఎన్నికల నిర్వహణలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.
ఎన్నికల విధుల్లో 1,000 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల సేవలు అభినందనీయం
పోలింగ్ కేంద్రాల వద్ద దాదాపు 1,000 మంది ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు సేవలందించారని తెలిపారు. ఓటర్లకు అవసరమైన సహాయ సహకారాలు అందించడం, క్యూలైన్లను క్రమబద్ధీకరించడం, రద్దీని నియంత్రించడం వంటి విధుల్లో వాలంటీర్లు చూపిన చొరవ, సేవా దృక్పథం అభినందనీయమని పేర్కొన్నారు.
సమష్టి కృషి, సమన్వయంతో ప్రశాంతంగా పోలింగ్
ఎన్నికల విధుల్లో పాల్గొన్న ప్రతి అధికారి, సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించడం, శాఖల మధ్య నిరంతర సమన్వయం, క్షేత్రస్థాయిలో పటిష్టమైన పర్యవేక్షణతో పోలింగ్ ప్రక్రియ విజయవంతమైందని తెలిపారు. ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయడంలో అన్ని శాఖలు సమర్థవంతంగా పనిచేశాయని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ విజయవంతంగా ముగిసేందుకు విశేష కృషి చేసిన పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ తదితర అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లతో పాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ, నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు ప్రత్యేక అభినందనలు, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
