-దివ్య దక్షిణ యాత్ర, సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్రకు ప్రత్యేక ప్యాకేజీలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
కార్తీక మాసం సందర్భంగా పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే భక్తుల కోసం ఐఆర్‌సీటీసీ రెండు ప్రత్యేక భారత్ గౌరవ్ టూరిస్ట్ రైళ్లను ఏర్పాటు చేసింది. ‘కార్తీక మాసం – అరుణాచలంతో దివ్య దక్షిణ యాత్ర’, ‘సప్త (07) జ్యోతిర్లింగ దర్శన యాత్ర’ పేర్లతో ప్రత్యేక టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఐఆర్‌సీటీసీ విజయవాడ ప్రాంతీయ అధికారి ఎం. రాజా ఒక ప్రకటనలో తెలిపారు.
1. కార్తీక మాసం – అరుణాచలంతో దివ్య దక్షిణ యాత్ర (SCZBG69)
ఈ యాత్ర 2026 నవంబర్ 23 నుంచి డిసెంబర్ 1 వరకు మొత్తం 9 రోజులు, 8 రాత్రుల పాటు కొనసాగుతుంది. సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఈ రైలు విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు మీదుగా ప్రయాణిస్తుంది.
ఈ యాత్రలో సందర్శించనున్న ప్రముఖ పుణ్యక్షేత్రాలు:
తిరువణ్ణామలై అరుణాచలం దేవాలయం
రామేశ్వరం రామనాథస్వామి దేవాలయం
మధురై మీనాక్షి అమ్మన్ ఆలయం
కన్యాకుమారి రాక్ మెమోరియల్, కుమారి అమ్మన్ ఆలయం
తిరుచ్చి శ్రీరంగనాథస్వామి ఆలయం
తంజావూరు బృహదీశ్వర ఆలయం
చిదంబరం నటరాజ దేవాలయం
టికెట్ ధరలు (ఒక్కొక్కరికి):
తరగతి పెద్దలు పిల్లలు (5–11 ఏళ్లు)
స్లీపర్ క్లాస్ ₹15,800 ₹14,800
3AC ₹23,200 ₹22,000
2. సప్త (07) జ్యోతిర్లింగ దర్శన యాత్ర (SCZBG68)
ఈ యాత్ర 2026 నవంబర్ 10 నుంచి నవంబర్ 20 వరకు నిర్వహించనున్నారు. మొత్తం 10 రోజులు, 11 రాత్రుల పాటు సాగే ఈ పర్యటన సికింద్రాబాద్ నుంచి ప్రారంభమై నాందేడ్, పూర్ణ జంక్షన్ మీదుగా వివిధ పుణ్యక్షేత్రాలకు చేరుకుంటుంది.
ఈ యాత్రలో సందర్శించనున్న పుణ్యక్షేత్రాలు:
ఉజ్జయినిలో మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగాలు
ద్వారకలో నాగేశ్వర్ జ్యోతిర్లింగం, ద్వారకాధీశ్ మందిరం, బేట్ ద్వారక
సోమనాథ్ జ్యోతిర్లింగం
పుణెలో భీమాశంకర్ జ్యోతిర్లింగం
నాసిక్‌లో త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం
ఛత్రపతి శంభాజీనగర్‌లో ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం
టికెట్ ధరలు (ఒక్కొక్కరికి):
తరగతి పెద్దలు పిల్లలు (5–11 ఏళ్లు)
స్లీపర్ క్లాస్ (ఎకానమీ) ₹18,000 ₹16,700
3AC (స్టాండర్డ్) ₹27,400 ₹25,900
ప్యాకేజీలో లభించే సౌకర్యాలు
రెండు యాత్రా ప్యాకేజీల్లోనూ ప్రయాణికులకు టిఫిన్, శాఖాహార అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం, ప్రయాణ బీమా, హోటల్ వసతి, స్థానిక రవాణా, టూర్ ఎస్కార్ట్ సేవలు, రైలులో భద్రత, ఐఆర్‌సీటీసీ టూర్ మేనేజర్ల సహాయం, వర్తించే అన్ని పన్నులు కల్పించనున్నారు.
బుకింగ్, వివరాల కోసం సంప్రదించండి
ఐఆర్‌సీటీసీ కార్యాలయం, రైల్వే రిటైరింగ్ రూమ్ సమీపంలో, విజయవాడ రైల్వే స్టేషన్.
9281030714, 9281495848, 7670900698.
ఆన్‌లైన్ బుకింగ్, పూర్తి వివరాల కోసం www.irctctourism.com వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఐఆర్‌సీటీసీ అధికారులు సూచించారు.
కార్తీక మాసంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే భక్తులు ఈ ప్రత్యేక రైలు ప్యాకేజీలను వినియోగించుకోవచ్చని తెలిపారు.
