ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించండి: మాజీ మంత్రి దేవినేని ఉమా

-గొల్లపూడిలో ఎంపీటీసీ అభ్యర్థి లక్ష్మీనారాయణ కు సైకిల్ పై, జడ్పిటిసి అభ్యర్థి నూతలపాటి బాలకి కమలం గుర్తులపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రజలకు పిలుపునిచ్చారు. గొల్లపూడి ఎంపీటీసీ అభ్యర్థి లక్ష్మీనారాయణకు సైకిల్ గుర్తుపై, విజయవాడ రూరల్ జడ్పీటీసీ అభ్యర్థి నూతలపాటి బాల కోటేశ్వరరావుకు కమలం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని వివరించారు. ప్రజలు అభివృద్ధిని, సుపరిపాలనను బలపరుస్తూ సైకిల్, కమలం గుర్తులపై తమ అమూల్యమైన ఓటు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.