వైసీపికి ఓటు అడిగే హక్కు లేదు

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
-రొద్దం మండలం తురకలాపట్నంలో వైసీపీకి గట్టి షాక్
-12 ఎస్సీ కుటుంబాలు టీడీపీలో చేరిక
-వారందరికీ పసుపు కండువా కప్పి పార్టీలోకి మంత్రి సవిత ఆహ్వానం

పెనుకొండ/శ్రీసత్యసాయి, నేటి పత్రిక ప్రజావార్త:
పెనుకొండ నియోజక వర్గంలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. నియోజక వర్గంలో రొద్దం మండలం తురకాలపట్నం గ్రామానికి చెందిన పలు ఎస్సీ కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. వారందరికీ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత పసుపు కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ టీడీపీ కార్యాలయంలో సోమవారం రొద్ద మండలం తురకాలపట్నం గ్రామానికి చెందిన 12 ఎస్సీ కుటుంబాలు టీడీపీలో చేరాయి. వైసీపీ ఎస్సీ సెల్ నాయకులు పూజారిశంకర, పూజారి మారుతి ఆధ్వర్యంలో వారంతా టీడీపీలో చేరారు. మంత్రి సవిత వారందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రాన్ని జగన్ అధోగతి పాల్జేశారన్నారు. ఏ ఎన్నికలైనా ఓటు అడిగే హక్కు జగన్ కుగాని, గొడ్డలి పార్టీకి గాని లేదన్నారు. జగన్ అసమర్థ పాలన, నిర్ణయాలతో ప్రజలతో పాటు చివరికి వైసీపీ శ్రేణులు సైతం వేసిగి వేసారిపోయాయన్నారు. త్వరలో వైసీపీ నుంచి టీడీపీలోకి మరిన్ని చేరికలుంటాయని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలతో రాష్ట్రంలో వైసీపీ ఉనికి గల్లంతవ్వడం ఖాయమన్నారు. పెనుకొండ నియోజక వర్గం సహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిదే విజయమని ధీమా వ్యక్తంచేశారు. పార్టీలోని చేరినవారంతా టీడీపీ, కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని మంత్రి సవిత దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ, సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో రాష్ట్రంలో అభివృద్ధిని మెచ్చి టీడీపీలో చేరుతున్నామన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా మంత్రి సవిత నేతృత్వంలో పెనుకొండ నియోజక వర్గంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతోందన్నారు. రొద్దం మండలంలో మంత్రి సవిత దిశా నిర్దేశం మేరకు కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని వారు తెలిపారు. టీడీపీలో చేరిన వారిలో పూజారి శంకర, పూజారి విష్ణు, పూజారి మారుతి, పూజారి అర్జున్, హెచ్.అంజనప్ప, హెచ్.గంగాధర్, హెచ్.అంజి, పూజారి చక్రి, పెద్ద అంజి, గంగాధరప్ప కుటుంబాలతో పాటు జనసేనకు చెందిన పూజారి మారుతి కుటుంబంగా కూడా ఉంది.