విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఎంపీ కేశినేని చిన్ని విస్తృత ప్రచారం

-86, 85, 84, 83, 82, 78వ డివిజన్లలో రోడ్‌షో.. అడుగడుగునా ఘన స్వాగతం పలికిన మహిళలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 86, 85, 84, 83, 82, 78వ డివిజన్లలో కూటమి మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుతో కలిసి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్‌షోకు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దారిపొడవునా మహిళలు హారతులు పట్టి ఘనస్వాగతం పలికారు.

రోడ్‌షోలో భాగంగా ఎంపీ కేశినేని చిన్ని ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. విజయవాడ నగర అభివృద్ధిని మరింత వేగవంతం చేయాలంటే మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ప్రజలు మద్దతు తెలపాలని కోరారు.

కూటమి మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణతో పాటు సెంట్రల్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో పోటీ చేస్తున్న కూటమి కార్పొరేటర్ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఎంపీ కేశినేని చిన్ని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) వ్యాఖ్యలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమని ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి అండగా నిలుస్తారని తెలిపారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని అన్నారు. పెన్షన్ల పెంపు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ వంటి పథకాలతో ప్రజలకు అండగా నిలుస్తోందని వివరించారు. విజయవాడ వంటి నగర ప్రాంతాల్లోనూ పేదలకు ఇళ్ల పట్టాలు అందించే కార్యక్రమాలను చేపట్టడం ప్రభుత్వ ప్రజా సంక్షేమ దృక్పథానికి నిదర్శనమని పేర్కొన్నారు.

విజయవాడ నగరాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రజలు కూటమికి అండగా నిలవాలని ఆయన కోరారు. మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణతో పాటు సెంట్రల్ నియోజకవర్గంలోని కూటమి కార్పొరేటర్ అభ్యర్థులందరినీ అఖండ మెజారిటీతో గెలిపించి, నగర అభివృద్ధికి సహకరించాలని ఎంపీ కేశినేని చిన్ని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.