-బీజేపీ సీనియర్ నాయకులు పైలా సోమి నాయుడు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపునకు కృషిచేసి కూటమి ఐక్యతను చాటి చెబుదామని బీజేపీ సీనియర్ నాయకులు పైలా సోమి నాయుడు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ఎన్నికల అబ్జర్వర్ గా నియమితులైన సందర్భంగా భవానిపురం ఎన్డీయే కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ బాజీ పైలా కు నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా పైలా సోమి నాయుడు మాట్లాడుతూ కార్యకర్తలందరూ కూటమి ప్రభుత్వ ధర్మాన్ని పాటిస్తూ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీ వీ ఎన్ మాధవ్, ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో ఎన్నికల అబ్జర్వర్ గా నియమితుడవటం సంతోషకరమని సమన్వయంతో తన బాధ్యతను నెరవేరుస్తానన్నారు. గత వైసీపీ పాలనలో అరాచకం తప్ప అభివృద్ధి లేదని కూటమి ప్రభుత్వ రెండున్నరేళ్లలో పాలనలో జరిగిన అభివృద్ధిని చూసి ఎన్డీయే కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మేయర్ అభ్యర్థి వంగవీటి రాధా కృష్ణ, మరియు కూటమి అభ్యర్థుల గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ బాజీ , ఎన్టీఆర్ జిల్లా బీజేపీ మైనార్టీ మోర్చా ఇన్చార్జ్ దుర్బేసుల హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
