విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో కోవిడ్ సహాయక చర్యల్లో భాగంగా రూ.22 లక్షల విలువైన వివిధ వైద్య సంబంధిత పరికరాలు వస్తువులను అందజేసిన డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ పౌండేషన్, మంత్ర సంస్థలను జిల్లా కలెక్టర్ జె. నివాస్ ప్రత్యేకంగా అభినందించారు. స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం 22 లక్షల విలువైన 550 పల్స్ ఆక్సిమీటర్లు, 2000 పిపిఇ కిట్లు, 5000 ఎస్-95 మాస్కులు, 5000 చొజులు, 500 ఆక్సిజన్ ఫ్లోమీటర్లను డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ పౌండేషన్, మంత్ర సంస్థల ప్రతినిధులు వేణుగోపాలరావు, లక్ష్మి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జె. నివాస్ మాట్లాడుతూ కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా వైద్య పరికరాలు ఇతర వస్తువులను అందించడాని జిల్లా యంత్రాంగం స్వాగతిస్తుందన్నారు. జిల్లాలో మారుమూల ప్రాంతమైన ఎదురుమొండిలో మెరుగైన వైద్య సేవలకోసం ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఇతర వైద్య పరికరాలను మంత్ర సంస్థ ఆధ్వర్యంలో అందించడం జరిగిందన్నారు. కోవిడ్ సమయంలో స్వచ్చంద సంస్థలు అన్ని విధాల ప్రభుత్వానికి తోడుగా నిలబడ్డారన్నారు. ఇంకా మరింత సహాయ సహకారలను అందించాలని కోరామని అందుకు వారు ఎంతో స్పందించారన్నారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు వేణుగోపాలరావు, లక్ష్మిని కలెక్టర్ జె.నివాస్ శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పునిత్, తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం
-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …