అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు తెగల సహకార ఆర్థిక సంస్థ (ట్రైకార్) డైరెక్టర్లుగా ముగ్గురుని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజక వర్గానికి చెందిన పారాది చిన్నపుదొరను, కృష్ణా జిల్లా విజయవాడ పశ్చిమ నియోజక వర్గానికి చెందిన మద్దిల రామకృష్ణను మరియు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజక వర్గానికి చెందిన సవరా ఈశ్వరమ్మను డైరెక్టర్లుగా నియమిస్తూ సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే జి.ఓ.ఆర్టి.సంఖ్య.298 ను ఈ నెల 22 న జారీచేశారు. ట్రైకార్ డైరెక్టర్లుగా వీరు పదవీ భాద్యతలు చేపట్టిన నాటి నుండి రెండేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగుతారని ఆ ఉత్తర్వులలో పొందుపర్చడమైనది.
Tags AMARAVARTHI
Check Also
ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …