Breaking News

ప్రగతి అంశాలపై ఢిల్లీ నుండి ప్రధాన మంత్రి నరేంద్ర మోడి సిఎస్ లతో వీడియో సమావేశం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో చేపట్టిన రైల్వే,రోడ్లు,విమానాశ్రయాలు తదితర ప్రాజెక్టులకు సంబంధించి ప్రగతి అంశాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడి కేంద్ర ప్రభుత్వ శాఖల కార్యదర్శులు,వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో బుధవారం ఢిల్లీ నుండి వీడియో సమావేశం ద్వారా ఆయా ప్రాజెక్టుల ప్రగతిని సమీక్షించారు.ఈవీడియో సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి కోటిపల్లి-నరసాపురం నూతన రైల్వేలైను నిర్మాణానికి సంబంధించి భూసేకరణ ఇతర అంశాల ప్రగతిని ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ తో సమీక్షించారు. ఈవీడియో సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ మాట్లాడుతూ కోటిపల్లి-నర్సాపురం నూతన రైల్వే లైను నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ వివరాల ప్రతిని ప్రధానికి వివరించారు.భూసేకరణ ప్రక్రియను వేగవతంగా పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు సిఎస్ వివరించారు. ఈవీడియో సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్,టిఆర్అండ్బి,వైద్య ఆరోగ్య శాఖల ముఖ్య కార్యదర్శులు యంటి.కృష్ణ బాబు,అనిల్ కుమార్ సింఘాల్,వైద్య ఆరోగ్యశాఖ కమీషనర్ కె.భాస్కర్,సిఎస్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పి.ప్రశాంతి పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *