విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రజల ఆశీర్వాదం, ఆదరాభిమానాలే తమకు అసలైన బలమని, ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని అభివృద్ధి రూపంలో తిరిగి అందిస్తామని 64వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కూటమి కార్పొరేటర్ వీరమాచినేని లలిత పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఆమె అన్నారు. ఈ అద్భుతమైన విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు ఇచ్చిన విజయాన్ని బాధ్యతగా భావించి, వారి ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా మరింత అంకితభావంతో పనిచేస్తానని స్పష్టం చేశారు.
తాను నాలుగోసారి కార్పొరేటర్‌గా ఎన్నిక కావడం ప్రజలు తనపై ఉంచిన నమ్మకానికి, ఆదరాభిమానాలకు నిదర్శనమని పేర్కొన్నారు. 64వ డివిజన్లో ఏకగ్రీవంగా ఎన్నిక కావడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని, వరుసగా ప్రజల మద్దతు లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. తనను ఆదరించి ఏకగ్రీవంగా ఎన్నుకున్న డివిజన్ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న తన భర్త కిశోర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆయన పుట్టిన ప్రాంతం కావడంతో 64వ డివిజన్‌ను మరింత అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తనపై ఉందని పేర్కొన్నారు. డివిజన్లో మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.
అదేవిధంగా విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ భారీ మెజారిటీతో ఘన విజయం సాధించడం సంతోషకరమని వీరమాచినేని లలిత అన్నారు. నగర అభివృద్ధి కోసం మేయర్, ఎమ్మెల్యేలు, ఎంపీ, కార్పొరేటర్లు సమన్వయంతో పనిచేస్తూ విజయవాడను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ 64వ డివిజన్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆమె పునరుద్ఘాటించారు.
ప్రజల ఆశీర్వాదమే మా బలం.. 64వ డివిజన్‌ను ఆదర్శంగా అభివృద్ధి చేస్తాం : కార్పొరేటర్ వీరమాచినేని లలిత
