Breaking News

ఎస్సీ ల పై జరుగుతున్నఅన్యాయాల పై న్యూఢిల్లీ లో ప్రసంగించిన రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ విక్టర్ ప్రసాద్

-ఎస్సీ లకు న్యాయం చేసేందుకు రాష్ట్ర ఎస్సీ కమిషన్ కృషి
-ఎస్సీల పై దాడులు చేసిన వారికి స్టేషన్ బెయిల్ రాకుండా ఉండేందుకు 41 (సీ) రద్దు చేయాలి
-ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం నేరాలను అడ్డుకోవడానికి, నేరస్తులను శిక్షించడానికి ఉపయోగపడాలి

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీల పై జరుగుతున్న అరచకాలను అడ్డుకోవాల్సిన అవసరముందని రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ పేర్కొన్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఆంధ్ర ప్రదేశ్ భవన్ లోని గురజాడ కాన్ఫరెన్స్ హాల్ లో ఆయన విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 24 న బాధ్యతలు స్వీకరించిన తరువాత ప్రముఖులను కలవడానికి ఢిల్లీ రావడం జరిగిందన్నారు. జాతీయ ఏసీ కమిషన్ ఛైర్మన్ విజయ్ సంప్లా, వైస్ చైర్పర్సన్ అరుణ్ హైదర్ లను కలిశామన్నారు. 41 (సీ) వల్ల ఎస్సీల పై దాడులు చేసిన వారు స్టేషన్ బెయిల్ పై విడుదలవుతున్నారని వివరించారు. ఎస్సీల పై దాడులు చేసిన వారికి స్టేషన్ బెయిల్ రాకుండా ఉండేందుకు 41 (సీ) రద్దు చేయాలని విజ్ఞప్తి చేశామని తెలిపారు. ప్రస్తుతం 7 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న నేరస్థులకు శిక్ష పడటంలేదని తెలిపారు. ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం ఎస్సీ/ఎస్టీ లకు రక్షణ కల్పించగలగాలన్నారు. ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం నేరాలను అడ్డుకోవడానికి, నేరస్తులను శిక్షించడానికి ఉపయోగపడాలని పేర్కొన్నారు. ఎస్సీ లకు న్యాయం చేసేందుకు రాష్ట్ర ఎస్సీ కమిషన్ కృషి చేస్తోందన్నారు.

Check Also

విఘ్నేశునికి మల్లాది విష్ణు ప్రత్యేక పూజలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వినాయక చవితి ఉత్సవాలు నియోజకవర్గంలో వైభవంగా సాగుతున్నాయి. వివిధ మండపాల్లో విభిన్న రూపాల్లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *