-జిల్లాలో 734 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు …
-కలెక్టరు జె. నివాస్
మండవల్లి,(లింగాల), నేటి పత్రిక ప్రజావార్త :
రైతు పండించే ధాన్యాన్ని వారి గ్రామాల్లోనే కొనుగోలు చేసేందుకు ఆర్బీకేల్లోనే కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని కలెక్టరు జె. నివాస్ అన్నారు. మండవల్లిమండలం లింగాల గ్రామంలో శుక్రవారం కలెక్టరు జె. నివాస్ అధికారులతో కలసి ఆర్బీకేలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈసందర్బంగా కలెక్టరు స్వయంగా తేమ శాతాన్ని పరీక్షించే ఎలక్ట్రానిక్ మిషన్ ను పనితీరును పరిశీలించిన సమయంలో తేమ శాతాన్ని ఖచ్చితంగా తెలపకపోడంతో దాని స్థానంలో కొత్త మిషన్ ఏర్పాటు చేశారు. అనంతరం కలెక్టరు మాట్లాడుతూ జిల్లాలో రైతుల నుంచి కనీస మద్దతు ధరకు ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కోసం 734 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసామన్నారు. వ్యవసాయ ప్రాధమిక సహకార సోసైటీల ఆధ్వర్యంలో 517, డిసియంఎస్ ఆధ్వర్యంలో 121, మార్కెంటింగ్ ఆధ్వర్యంలో 96 ధాన్యం కొనుగోలు కేంద్రాలన్నీ ఈ సారి రైతు నివశించే గ్రామాల్లో గల ఆర్బీకేల్లోని ఏర్పాటు చేసామన్నారు. ఈ కేంద్రాల్లో విధులు నిర్వహించేందుకు డేటా ఆఫరేటర్, టెక్నికల్ అసిస్టెంట్లును తీసుకునే అవకాసాన్ని ఆయా ఏజెన్సీలకు కల్పించామన్నారు. రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు చేరవేసేందుకు అయ్యే రవాణా, హామాలీ ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందన్నారు. మాయిచ్చర్ మిషన్ ద్వార తేమ శాతాన్ని రైతుకు చూపించి క్యూపన్ ఇస్తున్నామన్నారు. రైతులు తేమ శాతం తగ్గించాలని కోరగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామన్నారు. కైకలూరు, ముదినేపల్లి, మండవల్లి మండలాల్లో పంటలు ముందుగా వచ్చాయని ఇక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించేందుకు వచ్చామన్నారు. రైతులు ఎవరైతే ట్రాన్స్ పోర్టు చేసుకుంటున్నారో వారికే ట్రాన్స్ పోర్టు ఛార్జీలు అందిస్తామన్నారు. జిల్లాలో ఇప్పటి వరక పది ఆర్బీకేలు ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేసామన్నారు. ఈ సందర్బంగా కౌలు రైతు దుద్దుకూరి వీరాంజేయులు కలెక్టరుకు వివరిస్తూ తాను చేస్తున్న పంట 1.5 ఎకరాలు పంటి వర్షాలు వలన దెబ్బతిన్నదని, అధికారులు ఈ క్రాప్ లో నమోదు కాలేదన్నారు. కలెక్టరు స్పందిస్తూ ఈ – క్రాప్ లో నమోదు అయ్యేవిధంగా చర్యలు చేపట్టాలని ఏడీ వ్యవసాయాధికారిని ఆదేశించారు. లింగాల గ్రామంలో జగనన్న ఇళ్లు లబ్దిదారులు కలెక్టరుకు వివరిస్తూ బెస్ మెంట్ నిర్మాణవరకు అయిన బిల్లులు రాలేదని వివరించగా కలెక్టరు డీఈ హౌసింగ్ అధికారిని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఇల్ల నిర్మాణానికి సంబందించి ఇప్పటి వరకు 29 లక్షలు ఉండగా 9 లక్షల మాత్రమే ఆన్ లైన్ జమ అయ్యిందని కలెక్టరుకు వివరించారు. మండలంలోని ఇంగిలిపాకలంక గ్రామంలో గల స్కూలు ఆవరణలో సచివాలయాన్ని నిర్మించడంలేదని అందుకు సంబందించిన డాక్యుమెంట్లను యంపీపీ కలెక్టరుకు చూపిస్తూ వివరించారు. కలెక్టర్ ఆర్డీవో శ్రీనుకుమార్, మండల తాహశీల్థారు, యంపీడీవో వ్యవసాయ అధికారులు, మడంల ప్రత్యేకాధికారి, ఆర్బీకే సిబ్బంది తదితరులు ఉన్నారు.