Breaking News

సచివాలయ ఉద్యోగులు పారదర్శకంగా సమయపాలన పాటిస్తూ ప్రజలకు సేవలందించాలి… : కలెక్టరు జె. నివాస్

మండవల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామ సచివాలయ ఉద్యోగులు పారదర్శకంగా సమయపాలన పాటిస్తూ ప్రజలకు సేవలందించాలని జిల్లా కలెక్టరు జె. నివాస్ అన్నారు.
శుక్రవారం మండవల్లి మండలం లింగాల రైతు భరోసా కేంద్రంలో గల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి అనంతరం గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేసారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయాల పరిదిలో ప్రజలకు అందిస్తున్న సేవలు పై రికార్డులను పరిశీలించి, పెండింగ్ లో ఉన్న అంశాలు త్వరిత గతిన పరిష్కరించాలని ఆదేశించారు. సచివాలయ ఉద్యోగులు సమయ పాలన పాటిస్తూ ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్దిదారులకు నిర్ణీత కాల వ్యవధిలోనే అందించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు అందింస్తున్న పథకాల అర్హతల తెలియజేసే పట్టికలు, పోస్టర్లు ప్రజలకు తెలియజేసే విధంగా సూచిక బోర్డుల్లో ప్రదర్శించిన విధానాన్ని పరిశీలించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధులు ప్రభలకుండా పరిశరాలు పరిశుభ్రతపై దృష్టి సారిస్తూ గ్రామాల్లో శానిటేషన్, అంతర్గత రహదారులు శుభ్రత పై దృష్టి సారించాలని సచివాలయ కార్యదర్శిని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనుకుమార్, తాహశీల్థారు, యంపీడీవో, సచివాలయ కార్యదర్శి, సిబ్బంది తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి… : ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు

-భక్తిశ్రద్ధలతో గణపతి మహోత్సవాలు నిర్వహిస్తున్న ప్రజలకు కూటమి ప్రభుత్వం సంపూర్ణ సహకారం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *