Breaking News

గాంధీ జయంతి సందర్భంగా మాంసం, చేపల విక్రయాలు పూర్తిగా నిషేధం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 2వ తేదీ (శుక్రవారం) గాంధీ జయంతి సందర్భంగా గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో మాంసం, చేపల విక్రయాలు పూర్తిగా నిషేధిస్తున్నామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గాంధీ జయంతి రోజున మాంసం, చేపల విక్రయాలపై నిషేధం అమలులో ఉంటుందని పేర్కొన్నారు. నగరంలోని మాంసం, చేపల విక్రయ దుకాణాలతో పాటు హోటళ్లు, రెస్టారెంట్లకు కూడా ఈ నిషేధ ఉత్తర్వులు వర్తిస్తాయని స్పష్టం చేశారు. నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ఇప్పటికే నగరపాలక సంస్థ సిఎంఓహెచ్ ద్వారా నగరంలోని అన్ని డివిజన్ల శానిటరీ ఇన్‌స్పెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే మాంసం, చేపల విక్రయ దుకాణానికి నిషేధానికి సంబంధించిన నోటీసులు అందించారని తెలిపారు. నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు, వ్యాపారులు నగరపాలక సంస్థ ఆదేశాలకు సహకరించి నిషేధాన్ని పాటించాలని విజ్ఞప్తి చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

దసరా ఉత్సవాలకు ఎంపీ కేశినేని చిన్ని కి ఆహ్వానం

-ఏర్పాట్లు, భక్తుల సౌకర్యాలపై వివరించిన దుర్గగుడి పాలకమండలి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ పరాభవ నామ సంవత్సర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *