Breaking News

Daily Archives: October 1, 2026

రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో జరిగే దసరా మహోత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో జరిగే దసరా మహోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు ఆహ్వానించారు. అక్టోబర్ 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాలకు రావాలని సీఎం చంద్రబాబును క్యాంప్ కార్యాలయంలో కలిసి ఆహ్వానపత్రిక అందించారు. ఈ సందర్భంగా అర్చకులు ముఖ్యమంత్రికి అమ్మవారి ప్రసాదాన్ని అందించి వేదాశీర్వచనం ఇచ్చారు. ఉత్సవాల ఏర్పాట్లపై ఆరా తీసిన సీఎం… భక్తులకు సౌకర్యాల కల్పనలో …

Read More »

కెపాసిటీ బిల్డింగ్‌పై ప్రభుత్వ ఉద్యోగులకు ఐఐటీ, ఐఐఎంలతో శిక్షణ

-పట్టణాల్లో తాగునీటి సమస్య పరిష్కారంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు -ఆర్టీజీఎస్ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ఉద్యోగులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ నిరంతర ప్రక్రియగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. క్యాంప్ కార్యాలయంలో బుధవారం వివిధ శాఖలు అందించే సేవలపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. ప్రభుత్వ ఉద్యోగులకు నైపుణ్య శిక్షణ, అన్నక్యాంటీన్లు, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సౌకర్యం, సంక్షేమ హాస్టళ్లల్లో వసతులు వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు …

Read More »

ఏపీలో పెట్టుబడుల ప్రవాహానికి ముంబై రోడ్‌షో శ్రీకారం

– నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖపట్నంలో సిఐఐ భాగస్వామ్య సదస్సు – మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్‌ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అపారమైన పెట్టుబడి అవకాశాలను పారిశ్రామిక వేత్తలకు వివరించేందుకు, నూతన భాగస్వామ్యాలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర‌ ప్రభుత్వం, భారత పరిశ్రమల సమాఖ్య (CII) సంయుక్తంగా ముంబైలో బుధ‌వారం భారీ ‘ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ రోడ్‌షో’ నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండ‌ప‌ల్లి …

Read More »

పట్టాల పంపిణీతో 26వేల పేద కుటుంబాలకు భరోసా

-డబుల్ ఇంజన్ సర్కార్‌తో పేదలకు వందల రెట్ల లబ్ది -ఎన్టీఆర్ జిల్లాలో ఇంటి పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు -రూ.28,112 కోట్ల విలువైన 707ఎకరాల భూములకు హక్కులు -విమెన్ వర్క్ ఫోర్సులో అగ్రస్థానంలో విశాఖ, విజయవాడ -కూటమి ప్రభుత్వ ప్రతి అడుగూ స్వర్ణాంధ్ర సాధన వైపే -ప్రభుత్వం చేసే అభివృద్ధికి అడ్డు పడటమే గొడ్డలి పార్టీ పని -విజయవాడలో ‘పేదలకు పట్టాభిషేకం’ బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూటమి …

Read More »

జర్నలిస్టులపై దాడుల కేసుల పరిశీలనకు హైపవర్ కమిటీ

-జర్నలిస్టుల భద్రత, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు, హత్యలు, వేధింపుల కేసుల పరిశీలనతో పాటు జర్నలిస్టుల భద్రత, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ఈ దిశగా హైపవర్ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం బుధవారం జి.ఓ. జారీ చేసింది. జర్నలిస్టుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. జర్నలిస్టులకు అవసరమైన మీడియా అక్రిడిటేషన్లు, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి సదుపాయాలను పునరుద్ధరించింది. 2016 లో ఏర్పాటు చేసిన …

Read More »

భవిష్యత్ అవసరాలకై సమగ్ర నీటి ప్రణాళిక

-పక్కాగా ఇరిగేషన్ క్యాలెండర్ అమలు -విశాఖ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కార చర్యలు -సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వివిధ రంగాలకు నీటి భద్రతే లక్ష్యంగా సమగ్ర నీటి ప్రణాళిక రూపొందించాలని, సాగునీటి ప్రాజెక్టుల పురోగతిలో ఎక్కడా రాజీ పడేది లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. క్యాంప్ కార్యాలయంలో బుధవారం జలవనరుల శాఖపై సీఎం సమీక్షించారు. రాష్ట్రానికి అవసరమైన సమగ్ర నీటి ప్రణాళికను రూపొందించాలంటూ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ …

Read More »

అవనిగడ్డ ఎస్ వి ఎల్ క్రాంతి డిగ్రీ కాలేజీ ఆవరణలో యోగ ప్రాణ శక్తి చికిత్సపై అవగాహన, శిక్షణ మరియు ప్రత్యక్ష ప్రదర్శన… : కాలేజీ కరెస్పాండంట్ ఉమామహేశ్వరరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అవనిగడ్డ ఎస్వీఎల్ కాలేజీ ఆవరణలో జరిగిన యోగ ప్రాణశక్తి చికిత్స పై అవగాహన, శిక్షణ మరియు ప్రత్యక్ష ప్రదర్శన కార్యక్రమానికి విజయవాడ అక్యూపంక్చర్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ మాకాల సత్యనారాయణ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యు హెచ్ ఓ )లక్ష్యాలకు భిన్నంగా ప్రపంచ ఆరోగ్యo క్షీణిస్తున్న ఈ సందర్భంలో, రేపటి ప్రపంచానికి భారతీయ సనాతన ఆరోగ్య విధానం యోగాలోని ప్రాణమయ కోశా తోనే సాధ్యమని డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు. మానవుల్లో …

Read More »

సభ్యుల నమ్మకమే బ్రాహ్మణ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి బలం

-రూ.100 కోట్ల డిపాజిట్లు, లక్ష సభ్యత్వమే లక్ష్యంగా….. -18–60 ఏళ్ల సభ్యులకు రూ.50 వేల ఇన్సూరెన్స్ రక్షణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని మరింత బలోపేతం చేసి, ప్రతి సభ్యుడికి ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ తెలిపారు. గొల్లపూడిలోని బ్రాహ్మణ కార్పొరేషన్ కార్యాలయంలో సొసైటీ ప్రతినిధులు, అధికారులు, సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో సొసైటీ ప్రగతి, సభ్యుల సంక్షేమం, భవిష్యత్ కార్యాచరణపై సమీక్షించారు. ముఖ్యమంత్రి …

Read More »

ఏషియన్ గేమ్స్ లో ఆర్చరీ కాంపౌండ్ విభాగంలో స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్న భారత్ పురుషుల మరియు మహిళా జట్లు.

-ఆంధ్రప్రదేశ్ కు చెందిన జ్యోతి సురేఖను మరియు గణేష్ మణిరత్నం ను అభినందించిన శాప్ చైర్మన్ రవి నాయుడు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జపాన్‌లోని ఐచి–నాగోయా వేదికగా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4, 2026 వరకు జరుగుతున్న 20వ ఏషియన్ గేమ్స్‌లో భారత మహిళల, పురుషుల కాంపౌండ్ ఆర్చరీ జట్లు స్వర్ణ పతకాలు సాధించిన సందర్భంగా శాప్ చైర్మన్ రవి నాయుడు హర్షం వ్యక్తం చేసి, విజేతలకు అభినందనలు తెలిపారు. భారత ఆర్చరీ మహిళా జట్టు ఫైనల్స్ లో చైనా …

Read More »

మాదకద్రవ్యాలు మరియు సోషల్ మీడియా దుర్వినియోగ పై వర్క్ షాప్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నవజీవన్ బాల భవన్ ఆధ్వర్యంలో విజయవాడ కేదారేశ్వర పేట లోని అంగన్‌వాడీ సెంటర్‌లో మూడోవ సెక్టార్‌కు చెందిన అంగన్‌వాడీ కార్యకర్తల కు మాదకద్రవ్యాలు మరియు సోషల్ మీడియా దుర్వినియోగ పై వర్క్ షాప్ కార్యక్రమాన్ని నిర్వహించారు . ఈ కార్యక్రమము లో నవజీవన్ బాల భవన్ ప్రోగ్రాం మేనేజర్ గోళ్ళమూడి శేఖర్ బాబు మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, విద్య, ఆరోగ్యం, కుటుంబ జీవితం మరియు సామాజిక సంబంధాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం …

Read More »