Breaking News

రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో జరిగే దసరా మహోత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో జరిగే దసరా మహోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు ఆహ్వానించారు. అక్టోబర్ 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాలకు రావాలని సీఎం చంద్రబాబును క్యాంప్ కార్యాలయంలో కలిసి ఆహ్వానపత్రిక అందించారు. ఈ సందర్భంగా అర్చకులు ముఖ్యమంత్రికి అమ్మవారి ప్రసాదాన్ని అందించి వేదాశీర్వచనం ఇచ్చారు. ఉత్సవాల ఏర్పాట్లపై ఆరా తీసిన సీఎం… భక్తులకు సౌకర్యాల కల్పనలో ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. సీఎంను కలిసి ఉత్సవాలకు ఆహ్వానించిన వారిలో దుర్గగుడి ధర్మకర్తల మండలి ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఈఓ శీనా నాయక్, బోర్డు సభ్యులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

జర్నలిస్టులపై దాడుల కేసుల పరిశీలనకు హైపవర్ కమిటీ

-జర్నలిస్టుల భద్రత, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *