Breaking News

ఏషియన్ గేమ్స్ లో ఆర్చరీ కాంపౌండ్ విభాగంలో స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్న భారత్ పురుషుల మరియు మహిళా జట్లు.


-ఆంధ్రప్రదేశ్ కు చెందిన జ్యోతి సురేఖను మరియు గణేష్ మణిరత్నం ను అభినందించిన శాప్ చైర్మన్ రవి నాయుడు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జపాన్‌లోని ఐచి–నాగోయా వేదికగా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4, 2026 వరకు జరుగుతున్న 20వ ఏషియన్ గేమ్స్‌లో భారత మహిళల, పురుషుల కాంపౌండ్ ఆర్చరీ జట్లు స్వర్ణ పతకాలు సాధించిన సందర్భంగా శాప్ చైర్మన్ రవి నాయుడు హర్షం వ్యక్తం చేసి, విజేతలకు అభినందనలు తెలిపారు.

భారత ఆర్చరీ మహిళా జట్టు ఫైనల్స్ లో చైనా ను ఓడించి స్వర్ణ పతకం సాధించింది. ఈ మహిళల జట్టులో చికితా తనపర్తి, ప్రతికా ప్రదీప్ తో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వెన్నం జ్యోతి సురేఖ ఉన్నారు. అలాగే ఏషియన్ గేమ్స్‌లో జ్యోతి సురేఖకు ఇది నాలుగో స్వర్ణ పతకం కావడం విశేషం.

అదేవిధంగా, భారత పురుషుల జట్టు కూడా ఫైనల్‌లో చైనాను ఓడించి స్వర్ణ పతకాన్ని సాధించింది. ఈ జట్టులో సాహిల్ జాదవ్, కుశాల్ దలాల్ తోపాటు ఆంధ్రప్రదేశ్లోని నాయుడుపేట కు సంబంధించిన గణేష్ మణిరత్నం కూడా ఉన్నారు.

ఈ సందర్భంగా శాప్ చైర్మన్ రవి నాయుడు గారు మాట్లాడుతూ, భారత కాంపౌండ్ ఆర్చరీ జట్ల అద్భుత ప్రదర్శన దేశానికి గర్వకారణమని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తూ భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్‌కు మంచి గుర్తింపు తీసుకొస్తున్న వెన్నం జ్యోతి సురేఖ, గణేష్ మణిరత్నంతో పాటు మొత్తం జట్టు సభ్యులను ఆయన అభినందించారు.

జ్యోతి సురేఖ, గణేష్ మణిరత్నం వంటి క్రీడాకారులు తమ విజయాలతో యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని రవి నాయుడు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా భారత, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు అంతర్జాతీయ వేదికలపై మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పట్టాల పంపిణీతో 26వేల పేద కుటుంబాలకు భరోసా

-డబుల్ ఇంజన్ సర్కార్‌తో పేదలకు వందల రెట్ల లబ్ది -ఎన్టీఆర్ జిల్లాలో ఇంటి పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *