ఈ-ఆటోల ద్వారానే 100% చెత్త సేకరణే లక్ష్యం… : కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో ఈ-ఆటోల సమర్థవంతమైన వినియోగం ద్వారా నూరు శాతం చెత్త సేకరణ పక్కాగా జరిగేలా సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. గురువారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయాలయంలోని కమిషనర్ ఛాంబర్‌లో ఈ-ఆటోల సద్వినియోగం, నగరంలో నూరు శాతం చెత్త సేకరణ విధానాలపై ప్రజారోగ్య అధికారులు, ఈ-ఆటోల ఏజన్సీ ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరంలోని ప్రతి ఇల్లు, కమర్షియల్ సంస్థలు మరియు వ్యాపార సముదాయాల నుండి వ్యర్థాల సేకరణ నూరు శాతం జరగాల్సిందేనని స్పష్టం చేశారు. నగరంలో ఏ ఒక్కటి మినహాయింపు లేకుండా చెత్త సేకరణ ప్రక్రియ సాగాలని, అందుకు అనుగుణంగా ప్రతి ఆటోకు స్పష్టమైన రూట్ మ్యాప్‌లను తక్షణమే తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే నగరంలో నూతనంగా చేపడుతున్న గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్ల నిర్మాణం త్వరలోనే పూర్తికానున్న నేపథ్యంలో, తాత్కాలికంగా ఈ-ఆటోలకు దూరం తగ్గించి, ఎక్కువ ట్రిప్ లు కలిసేలా సేకరించిన చెత్తను హెవీ లోడర్లకు షిఫ్ట్ చేయడానికి తగిన స్థలాలను పరిశీలించి నివేదిక అందించాలని సూచించారు. దీంతో పాటు, సేకరించిన చెత్త బరువును ఖచ్చితంగా నమోదు చేసేందుకు గాను ఏటుకూరు గార్బేజ్ పాయింట్ వద్ద అదనంగా మరో వే-బ్రిడ్జిని వెంటనే నిర్మాణం చేయాలని డిఈఈని ఆదేశించారు. చెత్త సేకరణ విధానంలో ఎలాంటి లోపాలు లేకుండా, నగర ప్రజలకు మెరుగైన పారిశుధ్య సేవలు అందించడమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.
సమావేశంలో సిఎంఓహెచ్ డాక్టర్ శాంతికళ, ఎంహెచ్ఓ డాక్టర్ సురేష్ బాబు, డిఈఈ సతీష్ కుమార్, ఏఈ ప్రసాద్, ఎస్ఎస్ లు సోమ శేఖర్, ఐజాక్, సాంబయ్య, వెంకటప్పయ్య, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ అనిల్ కుమార్, ఇన్స్పెక్టర్ బుల్లయ్య పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లాస్టిక్ వాడకాన్ని నిలిపివేయాలి…

-స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ -గూడవల్లి పారిశుద్ధ్య కార్యక్రమాల్లో ‘స్వచ్ఛ ఆంధ్ర’చైర్మన్, డైరెక్టర్లు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *