-ట్రోఫీ, జెర్సీల ఆవిష్కరణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
9వ జాతీయ దివ్యాంగుల క్రికెట్ ఛాంపియన్‌షిప్–2026కు సంబంధించిన ట్రోఫీ మరియు జెర్సీలను డా. పసుపులేటి హరిప్రసాద్, ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ పి ఎ సి సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు, బోర్డ్ ఆఫ్ డిసేబుల్డ్ క్రికెట్ అసోసియేషన్–ఇండియా చైర్మన్ ఆధ్వర్యంలో విజయవాడ డీసీపీ సరితా, ఐ పి ఎస్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించనున్న 9వ జాతీయ దివ్యాంగుల క్రికెట్ ఛాంపియన్‌షిప్–2026 ఈ నెల అక్టోబర్ 23 నుంచి 28వ తేదీ వరకు అమరావతిలో జరుగనుంది. దేశవ్యాప్తంగా దివ్యాంగ క్రికెట్ క్రీడాకారులు ఈ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా డా. పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ, దివ్యాంగ క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీసేందుకు, వారికి జాతీయ స్థాయిలో తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశాలను కల్పించేందుకు ఇటువంటి క్రీడా కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. దివ్యాంగ క్రికెట్ అభివృద్ధికి అవసరమైన సహకారం, ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందన్నారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయవాడ డీసీపీ సరితా, ఐ పి ఎస్ ట్రోఫీ, జెర్సీలను ఆవిష్కరించారు. జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ఈ ఛాంపియన్‌షిప్ విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు. ఛాంపియన్‌షిప్ నిర్వహణ, క్రీడాకారులకు కల్పించాల్సిన సౌకర్యాలు, పోటీలకు సంబంధించిన ఏర్పాట్లపై నిర్వాహకులు చర్చించారు. అక్టోబర్ 23 నుంచి 28వ తేదీ వరకు అమరావతిలో జరిగే 9వ జాతీయ దివ్యాంగుల క్రికెట్ ఛాంపియన్‌షిప్–2026కు సంబంధించిన ట్రోఫీ, జెర్సీల ఆవిష్కరణ కార్యక్రమంతో పోటీలకు సంబంధించిన సన్నాహక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో బోర్డ్ ఆఫ్ డిసేబుల్డ్ క్రికెట్ అసోసియేషన్–ఇండియా అధ్యక్షులు మొహమ్మద్ అలీ ఖురేషీ, వై.వసంత కుమార్, ఏపీ డి సి ఏ, సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News