Breaking News

‘స్వచ్ఛ ఆంధ్ర’చైర్మన్, డైరెక్టర్లు దుర్గాదేవి దర్శనం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌తోపాటు కార్పోరేషన్ డైరెక్టర్లు వారి వారి కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఉదయం విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించారు. డైరెక్టర్లు అందరికీ చైర్మన్ పట్టాభిరామ్ కనకదుర్గ అమ్మవారి ఫొటోలను బహూకరించారు. దుర్గామాతను దర్శించుకున్నవారిలో కార్పోరేషన్ డైరెక్టర్లు చిన్ని శ్రీనివాసరావు, రవి కుమార్, ఆరుద్ర భూలక్ష్మి, లక్ష్మణరావు బొమ్మినేని, ఎం.నాగలక్ష్మి, ఎన్.పర్వీన్ భాను, నాగమణి బోలెం, పరుచూరి భవానీ రవికుమార్, రాము బుచ్చా, రెడ్డివారి మంజునాథ్, సానారెడ్డి కల్పనారెడ్డి, ఉదయ భాస్కర్ కూచిపూడి, పట్టాభిరామయ్య సాలాది, మువ్వల వెంకట రమణ, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

దసరా ఉత్సవాలకు ఎంపీ కేశినేని చిన్ని కి ఆహ్వానం

-ఏర్పాట్లు, భక్తుల సౌకర్యాలపై వివరించిన దుర్గగుడి పాలకమండలి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ పరాభవ నామ సంవత్సర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *