-డిజిటల్ మార్కెటింగ్‌లో ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం
-జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్.శ్రీనివాసరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకారంతో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో కానూరు తులసినగర్‌లోని ఫెడరల్ స్కిల్ అకాడమీ ట్రైనింగ్ సెంటర్లో డిజిటల్ మార్కెటింగ్ పై ఉచిత సర్టిఫికెట్ శిక్షణ నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్.శ్రీనివాసరావు తెలిపారు.
శిక్షణ అనంతరం ప్రముఖ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన 18 నుంచి 30 సంవత్సరాల వయస్సు గల అభ్యర్థులు ఈ శిక్షణకు అర్హులని తెలిపారు. అక్టోబర్ 5,2026 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత ధ్రువపత్రాలు, ఆధార్ కాపీ, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలతో కానూరు తులసినగర్‌లోని ఫెడరల్ స్కిల్ అకాడమీ ట్రైనింగ్ సెంటర్‌కు నేరుగా హాజరై నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 87146 92747, 87146 92748 నంబర్లను సంప్రదించాలని కోరారు.
Prajavartha Online Telugu News