విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్ సిటీ ప్లానర్ కె. సంజయ్ రత్న కుమార్ పౌరుల భద్రతను ప్రాధాన్యంగా తీసుకుంటూ, నగర సుందరీకరణలో భాగంగా అవసరం లేని వాడని కేబుల్ ఇంటర్నెట్ లేదా ఇతర వైర్లు ప్రజల భద్రతకు ప్రమాదకరంగా ఉండే పరిస్థితి కనిపిస్తే వెంటనే తొలగించాలని ఆదేశాలు చేశారు. ఈ సందర్భంగా చీఫ్ సిటీ ప్లానర్ మాట్లాడుతూ నగర పరిధిలో ఎక్కడైనా వేలాడుతూ ఉన్న కేబుల్, ఇంటర్నెట్ లేదా ఇతర వైర్లు, ప్రజల భద్రతకు ప్రమాదకరంగా ఉండే పరిస్థితి కనిపిస్తే, వాటిని వెంటనే తొలగించి, అందంగా ఉండేలా పునర్నిర్మించుకుంటున్నాం అని అన్నారు. అవసరంలేని, వాడని వైర్లను క్రమబద్ధీకరింస్తున్నాం అని అన్నారు. పౌరులు, కేబుల్ ఆపరేటర్లు అందరూ ఈ విషయాన్ని గమనించి, సమర్థవంతంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నగర సుందరీకరణలో భాగస్వాములు కావాలని కోరారు.
