మెరుగైన వైద్యం కోసం ఎల్ ఓ సీ పత్రాలు అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన ఎల్ ఓ సీ పత్రాలను 37 వ డివిజన్ కార్పొరేటర్ గుడిపాటి కిషోర్, కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలసి అందజేశారు. వాగు సెంటర్ కు చెందిన కోరాడ లక్ష్మీ (41) మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ వైద్య సాయం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 6.48 లక్షల ఎల్ ఓ సీ ను అందజేశారు

భవాని పురానికి చెందిన పఠాన్ జావేద్ ఖాన్ (46) కిడ్నీ స్టోన్స్ తో బాధపడుతూ మెరుగైన వైద్యం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 3.26 లక్షల విలువైన ఎల్ ఓ సీ ను అందజేశారు. త్వరితగతిన స్పందించి ఎల్ ఓ సీ పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి కు బాధితుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు

మాజీ కార్పొరేటర్లు యేదుపాటి రామయ్య , గుడివాడ నరేంద్ర రాఘవ, స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు, కూటమి నేతలు బెన్నా భక్తుల సోమేశ్వరరావు, కురాకుల సురేష్, పచ్చవ మల్లికార్జునరావు, బ్రహ్మరెడ్డి తదితరులు పాల్గొన్నారు.